బెడ్ రూంలో పాము .. మరి తెల్లవారాక ఏమైంది?

Teenage Girl Finds 16 feet Python in Her bedroom

11:42 AM ON 27th June, 2016 By Mirchi Vilas

Teenage Girl Finds 16 feet Python in Her bedroom

నడిరోడ్డుపై మనకి నాలుగు అడుగుల పాము కనిపిస్తే భయంతో పరుగులు తీస్తాం.... అలాంటిది 5 మీటర్ల పైతాన్ బెడ్ రూమ్ లో కనిపిస్తే... పైగా ఉదయం నిద్రలేవగానే విషెస్ చెబితే... అమ్మో ఇంకేమైనా ఉందా ? కేకలు పెట్టేస్తాం ... కాలు నిలవదు ... గుండె దడ దడ... అయితే క్వీన్స్ లాండ్ లో ఇదే జరిగింది. ఇంట్లో బెడ్ రూమ్ లో నిద్రిస్తున్న యువతికి ఉదయాన్నే నిద్రలేచి చూడగానే గోడపై 16 అడుగుల పైతాన్ కనిపించింది. ఇంకేముంది ఆ యువతి భయంతో బయటకు పరుగులు తీసింది. కాసేపటికి తేరుకుని ఆ పామును వీడియో తీసి నెట్ లో పెట్టింది. యూట్యూబ్ లో ఇప్పుడీ వీడియో హల్ చల్ చేస్తోంది.

English summary

Australian woman woke up to find a 16 feet giant Python in Her bedroom.