డిజైనర్‌ దుస్తుల్లో లాలు తనయుడు

Tejashwi Yadav orders designer clothes for Nitish’s swearing-in event

06:14 PM ON 20th November, 2015 By Mirchi Vilas

Tejashwi Yadav orders designer clothes for Nitish’s swearing-in event

మహాకూటమి తో బీహార్‌ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన నితిశ్ కుమార్ , లాలు ప్రసాద్ యాదవ్ లు ప్రమాణస్వీకార మహోత్సవ వేడుక కు సిద్దమవుతున్నారు . మహాకూటమిలో ప్రధాన నాయకుడైన లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వి యాదవ్ కూడా రఘోపూర్‌ నుండి ఎంఎల్‌ఎ గా ఎన్నికయ్యాడు.

తేజస్వి యాదవ్ బిహార్ ఉప ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం కోసం ఢిల్లీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మహ్మద్‌ రెహ్మన్‌ కు తన దుస్తులను తయారు చేయాల్సిందిగా కోరారు. డిజైనర్‌ మహ్మద్‌ రెహ్మన్‌ రాజకీయ నాయకుల వస్త్రాలు డిజైనర్‌ చేయడంలో దిట్ట.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రాజకీయ వారసులుగా బీహార్‌ రాజకీయాల్లో అడుగుపెట్టిన తన ఇద్దరు కుమారులైన తేజ్‌ ప్రతాప్‌ , తేజ్‌శ్వి యాదవ్‌ లు ఇద్దరూ ఎంఎల్‌ఏ లుగా ఎన్నికయ్యారు. లాలూ కూడా ప్రమాణస్వీకారోత్సవానికి జ్యోతిష్యశాస్త్ర పండితులు సూచించిన రంగులు కలిగిన దుస్తులను ధరించనున్నారు.

బీహార్‌ రాజకీయాల్లో లాలూ తనదైన ముద్రవేసారు . ఇప్పుడు లాలూ కుమారులు బీహార్ రాజకీయాల్లో ఏ విధమైన పాత్ర పోషిస్తారోనని అందరిలోను ఆసక్తి కలిగిస్తుంది.

English summary

Tejashwi Yadav, younger son of RJD chief Lalu Prasad, chooses to wear at the swearing-in ceremony of Nitish Kumar on Friday.