దొంగ అవతారమెత్తిన 'ఐస్‌క్రీమ్‌'!

Tejaswi Madivada changed as a thief

11:35 AM ON 23rd December, 2015 By Mirchi Vilas

Tejaswi Madivada changed as a thief

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటి తేజస్వి మదివాడ. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు లాంటి స్టార్‌ హీరోతో నటించడంతో మొదటి సినిమానే మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ తరువాత పలు చిత్రాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటించింది ఈ చిన్నది. ఆ తరువాత రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'ఐస్‌క్రీమ్‌' చిత్రంలో హీరోయిన్‌గా నటించడమే కాకుండా తన అందాలు కూడా ప్రదర్శించింది. ఇప్పుడు తేజస్వి హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 'జతకలిసే' క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తరువాత తేజస్వి మరో చిత్రం పేరు 'రోజులు మారాయి'.

ఈ చిత్రంలో తేజస్వి ఒక దొంగ పాత్రలో కనిపించనుంది. ప్రజలని బురిడి కొట్టించి డబ్బు సంపాదించే పాత్రలో తేజస్వి నటిస్తుంది. కేరింత చిత్రంలో పార్వతీశం పాత్రలో నటించిన యువ నటుడు రోజులు మారాయిలో తేజస్వి సరసన హీరోగా నటిస్తున్నాడు. మారుతి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మురళి అనే కొత్త దర్శకుడు తెరకెక్కినున్నాడు.

English summary

Tejaswi Madivada acting as a thief in Rojulu Maarayi movie.