ఉన్నఫళంగా బాయ్ ఫ్రెండ్ కావాలట

Tejaswi Madivada Wants Boyfriend

10:44 AM ON 1st August, 2016 By Mirchi Vilas

Tejaswi Madivada Wants Boyfriend

ఇక్కడ వాంటెడ్ బాయ్ ఫ్రెండ్ అంటూ ప్లేకార్డు పట్టుకుని మరీ వెయిట్ చేస్తున్న ఈ అమ్మడు పేరు తేజస్వి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో టాలీవుడ్ కి పరిచమైన నటి తేజస్వి ఆ సినిమాలో సమంతా వున్నా కూడా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. తరువాత వర్మ కంట్లో పడి ఐస్ క్రీం లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమాకి ఓపెనింగ్స్ కూడా తేజస్వి వల్లే వచ్చాయి. అంతలా అందులో హాట్ హాట్ గా చేయడంతో తేజస్వికి యూత్ లో మంచి క్రేజ్ వచ్చేసింది. అయితే వరుసగా తనకి హీరోయిన్ అవకాశాలు వస్తాయనుకున్న తేజస్వి సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

సినిమాలంటే హీరోయిన్ గా ఛాన్స్ రావడం లేదు గానీ, తేజస్వికి యూత్ లో వున్న ఫాలోయింగ్ కి మాత్రం ఏం కొదవలేదు. అందుకే మారుతి రీసెంట్ గా రోజులు మారాయి లో తేజస్విని హీరోయిన్ గా తీసుకున్నాడు. అది కూడా ఏవరేజ్ మూవీగానే మిగిలింది. ఇప్పుడు తనకి యూత్ లో వున్న క్రేజ్ తో హిట్ కొట్టడానికి విష్ యూ హ్యాపీ బ్రేక్ అప్ సినిమాతో వస్తోంది. మొత్తానికి ఓ రూట్ లోకి వచ్చిన తేజస్వికి ఇకనుంచి హీరోయిన్ గా వరుస ఛాన్స్ లు వస్తాయో రావో చూడాలి.

ఇవి కూడా చదవండి:ఈకట్టప్ప వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!

ఇవి కూడా చదవండి:మహేష్ బాబుని ఛీకొట్టిందా.. లేక కాదందా..!

English summary

Tejaswi Madivada who got good name with Seethamma Vakitlo Sirimalle Chettu and she acted as heroine in the films and now she announces that she wants a boy friend.