తెలంగాణా అసెంబ్లీలో 'బాహుబలి'

Telangana assembly congratulates Baahubali team for getting National Award

03:19 PM ON 30th March, 2016 By Mirchi Vilas

Telangana assembly congratulates Baahubali team for getting National Award

ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించి, 63వ జాతీయ స్థాయి చిత్రంగా కూడా ఎంపికైన నేపధ్యంలో 'బాహుబలి' సెగ అసెంబ్లీని తాకింది. ఏ చిన్న అవకాశం వచ్చినా రాజకీయంగా రచ్చ రచ్చ చేసుకునే అసెంబ్లీలో రాజకీయ పార్టీల మధ్య రాజకీయాలు తప్పించి మరోటి కనిపించదు. ఒకవేళ వచ్చినా అనూహ్య పరిణామాల మీదనే తప్పించి.. సాధారణంగా మరో ప్రస్తావన ఉండదు. ఇక.. సినిమాల గురించి చర్చ అనే మాట రానే రాదు కానీ ఆ ఛాన్స్ తెలంగాణ శాసనసభలో వచ్చింది. అది కూడా బాహుబలి గురించే... జాతీయ స్థాయి ఉత్తమ చిత్రంగా తొలిసారి అవార్డు అందుకున్న బాహుబలి సినిమా కు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది.

ఇది కూడా చదవండి: రాజమౌళి ట్విస్ట్: బాహుబలి బ్రతికే ఉంటాడా?

కలెక్షన్ల రికార్డుల్ని తిరగరాసి.. తెలుగు సినిమా రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్లిన బాహుబలికి.. జాతీయ అవార్డు లభించటం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన బాహుబలి తెలుగు సినిమా పరిశ్రమ సత్తాను చాటి చెప్పిందని కీర్తించారు. అంతేకాదు.. బాహుబలికి అభినందనలు తెలుపుతూ.. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. నిత్యం రాజకీయాలు మాత్రమే వినిపించే అసెంబ్లీలో.. అందుకు భిన్నంగా ఒక తెలుగు సినిమాకు ప్రశంసలు లభించటమే కాదు.. పార్టీలన్నీ తమ అభినందనల్ని చెప్పటం చూస్తుంటే, భవిష్యత్తులో తెలుగు సినిమాకు మంచి రోజులు వస్తాయనడంలో సందేహం లేదు...

ఇది కూడా చదవండి: కోటి పెట్టి కారు కొన్నయాంకర్

English summary

Telangana assembly congratulates Baahubali team for getting National Award. Telangana CM KCR also congratulates Baahubali team.