యాగానికి  బాబుని ఆహ్వానించిన  కెసిఆర్ 

Telangana CM Kcr invites AP CM Chandra Babu for Chandi Yagam

02:13 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Telangana CM Kcr invites AP CM Chandra Babu for Chandi Yagam

అయుత చండీ యాగానికి రావాలని ఎపి సిఎమ్ చంద్రబాబుని తెలంగాణా సిఎమ్ కెసిఆర్ ఆత్మీయంగా ఆహ్వానించారు. సోమవారం మధ్యాహ్నం విజయవాడ చేరుకున్నారు. ఆయనకు మంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాస్,యనమల రామకృష్ణుడు ,చినరాజప్ప , రావెల కిషోర్ బాబు సాదర స్వాగతం పల్కారు. ప్రత్యేక హెలికాప్టర్ లో బేగంపేట విమానాశ్రయం నుంచి వచ్చిన కెసిఆర్ వెంట మంత్రి ఈటెల రాజేందర్ , ఎంపి బాల్క సుమన్ వచ్చారు.

అనంతరం ఉండవల్లిలోని సిఎమ్ చంద్రబాబు నివాసానికి కెసిఆర్ చేరుకున్నారు. అప్పటికే నివాసం బయటకు వచ్చిన చంద్రబాబు పుస్పగుచ్చం అందించి , సాదరంగా ఆహ్వానించారు. ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు. అయుత చండీ యాగానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రాన్ని చంద్రబాబుకి కెసిఆర్ ఆత్మీయంగా అందించారు. శాలువాతో చంద్రబాబుని కెసిఆర్ సత్కరించారు. యాగం వివరాల గురించి నవ్వుతూ, కొద్దిసేపు కబుర్లు అయ్యాక ఆయనకు సిఎమ్ చంద్రబాబు ప్రత్యేక ఆంద్ర వంటకాలతో పసందైన విందు ఇచ్చారు. గోంగూర , ఉలవచారు , ముద్దపప్పు , చేపల పులుసు, కాకినాడ కాజా , నాడుకోడితో సహా 15 రకాల వంటకాలు విందులో సందడి చేసాయి. ఆహ్లాద కర వాతావరణంలో కబుర్లు చెప్పుకుంటూ విందు ఆరగించారు.

English summary

Telangana Chief minister invites Andhrapradesh cheif minister Nara Chandrababu naidu to attend for Chandi Yagam which is going to be start on december 23rd