కేసీఆర్ ఫ్యామిలీ రాశులు - మొక్కలు

Telangana CM KCR Participated in Haritha Haram

12:17 PM ON 15th July, 2016 By Mirchi Vilas

Telangana CM KCR Participated in Haritha Haram

అందరి బాటలో నడిస్తే, ప్రత్యేకత ఏముంటుందని అనుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, అందరూ చేసే పనినే భిన్నంగా, తనదైన మార్క్ ఉండేలా వ్యవహరించారు. వాస్తు మొదలు పలు నమ్మకాల్ని విపరీతంగా నమ్మే ఆయన.. హరితహారం పేరిట భారీగా మొక్కల్ని తెలంగాణ వ్యాప్తంగా నాటే పని లో భాగంగా సరికొత్త బాటను ఎంచుకున్నారు. మొక్కలు నాటాలని తెలంగాణా సర్కారు పిలుపు నివ్వడం, సినీ నటులు , సెలబ్రిటీలు హుషారుగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం తెల్సిందే. రికార్డు స్థాయిలో కోట్లాది మొక్కల్ని వారాల వ్యవధిలో నాటాలన్న లక్ష్యం పెట్టుకోవటమే కాదు.. ఇందుకోసం దాదాపు రూ.250 కోట్లకు పైనే ఖర్చు చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుంది. వందల కోట్లు ఖర్చు అయినా.. ఆయన చెప్పినట్లుగా.. గ్రీన్ బెల్ట్ తెలంగాణ వ్యాప్తంగా ఎంతోకొంత వృద్ధి చెందినా.. చేసిన ఖర్చుకు ఫలితం లభించినట్లే.

రాశులు , జన్మ నక్షత్రాలని బట్టి మొక్కలు నాటితే మంచిందని ఈమధ్య మళ్లీ విస్తృత ప్రచారం సాగుతోంది. రాశి బలానికి అనుగుణంగా మొక్క నాటితే మంచిందని అంటున్నారు. సరిగ్గా మొక్కల్ని నాటే విషయంలో ఇదే విషయాన్ని తెర మీదకు కేసీఆర్ తీసుకొచ్చారు. ప్రతి వ్యక్తి జన్మనక్షత్రం.. వారి రాశికి తగిన మొక్కను ఎంపిక చేసుకొని నాటితే బాగుంటుందన్న సూచన చేశారు. తాను చెప్పిన మాటలకు తగ్గట్లే కేసీఆర్ ఫ్యామిలీ తమ రాశి.. జన్మనక్షత్రాలకు తగిన మొక్కల్ని ఎంపిక చేసుకొని నాటారు. బేగంపేటలోని సీఎం అధికార నివాసంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. కేసీఆర్ ఫ్యామిలీ నాటిన మొక్కల లిస్టు ఓ సారి పరిశీలిద్దాం

1/7 Pages

సీఎం కేసీఆర్ ...

ఈయన రాశి కర్కాటకం కాగా.. ఆయన ఎంపిక చేసుకున్న మొక్క 'మోదుగ'. ఇక.. ఆయన జన్మనక్షత్రం అశ్లేష కావటంతో 'పొన్న' మొక్క ను కూడా నాటారు

English summary

Telangana CM and Family his members Participated in Haritha Haram.