స్కైప్‌లో విడాకులు మంజూరు చేసిన కోర్టు

Telangana Court Grants Divorce After Hearing On Skype

03:53 PM ON 24th November, 2015 By Mirchi Vilas

Telangana Court Grants Divorce After Hearing On Skype

స్కైప్ లో మాట్లాడిన తరువాత ఒక జంటకు విడాకులు మంజూరు చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

కిరణ్‌ కుమార్‌ కు 2012 లో పెళ్ళయింది. ఐతే తరువాత కాలంలో భార్య భర్తల మధ్య ఏర్పడిన మనస్పర్ధల కారణంగా విడిపోయారు. వీళ్ళిద్దరు ఒకరి పై మరొకరు పరస్పరం కేసులు కుడా పెట్టుకున్నారు.

తరువాత ఆమె పై చదువులకై అమెరికాకు వెళ్ళిపోయింది. దీంతో జంట కోర్టులో విడాకులు కోసం పిటిషన్‌ వేశారు. దీంతో ఎన్ని సార్లు చెప్పిన వారు కలిసి జీవించడానికి నిరాకరించడంతో వారిని కోర్టుకు రావాల్సిందిగా కోర్టు ఆదేశించింది. అమెరికాలో ఉన్న ఆమె రాలేనందున్న స్కైప్‌ ద్వారా జడ్జితో మాట్లాడుతుందని ఆమె తరపు న్యాయవాది చెప్పంతో జడ్జి ముందుగా లాప్‌టాప్‌లో ఆమె తండ్రి,భర్తను గుర్తించమని తరువాత ఖమ్మం కోర్టు జడ్జి వెంకట రమణ స్కైప్‌లో ఆమె చెప్పిన వాదనలు విన్నారు ఈ మేరకు విడాకులు మంజూరు చేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు.

English summary

Khammam Court Judge Gtranted Divorce To A Couple After Hearing One Of The Petitioners Over Skype