అవాంచనీయ ఘటనలు లేవన్న డిజిపి

Telangana DGP On GHMC Election Poling

12:08 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Telangana DGP On GHMC Election Poling

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ చెప్పారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదని స్పష్టం చేశారు. పోలీసుశాఖ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఓటర్లందరూ స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

కాగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవ్వగా, ఉదయం 10గంటలకు 11.25శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక 11గంటల ప్రాంతానికి 16.65 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. పోలింగ్‌ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

English summary

Telangana State DGP Anurag Sharma says that the poling of the elections was continues peacefully and he says that till 11:00 AM 16.65 percent of voting process was polled.