మొత్తానికి హరీష్ కి పచ్చ రంగు పడింది

Telangana Minister Harish Rao visit Tirumala

11:54 AM ON 20th June, 2016 By Mirchi Vilas

Telangana Minister Harish Rao visit Tirumala

తెలంగాణా టిడిపి వాళ్ళందరూ కారు ఎక్కేస్తుంటే, కారులో షికారు చేసే ఈ గులాబీ సేనాధిపతి మాత్రం పచ్చ షర్ట్ వేసేశాడు. ఏ చిన్న అవకాశం చిక్కినా పచ్చ పార్టీ అంటూ తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరిగే తత్వం తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు లో మెండుగా వున్నాయి. అందుకే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును.. ఆ పార్టీకి చెందిన నేతల్ని దుమ్ము దులిపే విషయంలో కేసీఆర్ తర్వాత ఎక్కువ మార్కులు హరీశ్ రావు కొట్టేస్తుండాడు. తెలుగుదేశం అన్నా.. ఆ పార్టీ నేతలన్నా సర్రున లేచే ఆయన.. పచ్చ పార్టీ అంటూ గుప్పించే విమర్శలు అన్నీ ఇన్నీ కాదు.

అలాంటి హరీశ్.. పచ్చ చొక్కా వేసుకొంటే ఏమనాలి. పైగా మొక్కు తీర్చుకున్న చందంగా పచ్చ చొక్కా వేసుకుని మరీ తిరుమల మెట్లు ఎక్కటం అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా తిరుమలకు వెళ్లిన హరీష్ తిరుపతిలోని అలిపిరి నుంచి తిరుమల కొండకు కాలినడకన వెళ్లారు. ఈ సందర్భంగా పసుపు టీ షర్ట్ ధరించారు. మిగిలిన విషయాల మాట ఎలా ఉన్నా.. రంగుల విషయంలో ఎప్పుడూ అలెర్ట్ గా ఉండే హరీశ్.. తన వైఖరికి భిన్నంగా ఎల్లో టీ షర్ట్ వేసుకోవటం విశేషంగా చెప్పాలి.

ఎంతైనా తెలుగుదేశం పార్టీలో కె సి ఆర్ ఓ వెలుగు వెలిగి వచ్చినందున ఆ కుటుంబానికి ఆ వాసనలు వుంటాయని కొందరు అంటుంటే, శుభానికి సంకేతంగా పసుపు చొక్కా వేసుకొని ఉండొచ్చంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏమైనా.. పచ్చ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించే హరీశ్ వంటి మీద పసుపు చొక్కా కనిపించేసరికి కొందరు ఖంగు తిన్నారట.

ఇది కూడా చూడండి: బీడీలు కాల్చండి బాబులూ..

ఇది కూడా చూడండి: హీరో నానిని కమల్ తో పోల్చేసింది

ఇది కూడా చూడండి: వామ్మో.. ఇదేంటంటూ మధ్యలోనే పారిపోయిన హీరోయిన్

English summary

Telangana Minister Harish Rao visit Tirumala.