అవును వాళ్ళు ఇలా స్టెప్పులేసారు...

Telangana Ministers Dance In Telangana Formation Day

01:25 PM ON 3rd June, 2016 By Mirchi Vilas

Telangana Ministers Dance In Telangana Formation Day

ఆనందం వస్తే, వాళ్ళు వీళ్ళు అని కాదు ఎవరైనా చిందేయ్యాల్సిందే. మరి ఓ రాష్ట్ర ఆవిర్భావ వేడుక అయితే ఇక చెప్పక్కర్లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆవిర్భావ వేడుకలు హోరెత్తుతున్నాయి. రాజధాని హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో సంబరాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో కరీంనగర్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సందడి చేశారు. డోలు చేతబట్టిన మంత్రి ఈటెల ఎమ్మెల్యేలతో కలిసి స్టెప్పులేశారు. మరోవైపు టిడిపి నుంచి మొన్ననే కారు ఎక్కిన మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి కూడా న్యూబోయిన్ పల్లి లో జరిగిన వేడుకల్లో చిందేశారు.

English summary

Telangana Ministers Etela Rajendar and Malla Reddy dacned in Telangana Formation day celebrations.