బాలయ్య వ్యాఖ్యల పై రచ్చ రచ్చ

Telangana netizens angry on Balakrishna controversial comments

01:49 PM ON 13th June, 2016 By Mirchi Vilas

Telangana netizens angry on Balakrishna controversial comments

నందమూరి నటసింహం బాలయ్య వ్యాఖ్యల పై మరోసారి దుమారం రేగింది. ఆ మధ్య సినిమా ఆడియో ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలు లేడీస్ కి ఆగ్రహం కలిగించడం ఆ తర్వాత సారీ చెప్పడం తెల్సిందే. ఈసారి అమెరికాలో బర్త్ డే వేడుకలు జరుపుకున్న బాలయ్య తెలంగాణా వాళ్ళ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు దుమారం లేపాయి. ఒకప్పుడు తెలంగాణ ప్రజానీకానికి అసలు తెల్లన్నం అంటే ఏమిటో తెలియదని, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, ఎన్టీ రామారావు వల్లే తెల్సిందని బాలయ్య చేసిన వ్యాఖ్యల పై తెలంగాణ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యల పై దుమారం రేగుతోంది.

ఫేస్ బుక్ వేదికగా ఆయన పై విరుచుకుపడుతున్నారు. ఫేస్ బుక్ ను ఆలంబనగా చేసుకుని ఆయన పై విమర్శలు చేస్తున్నారు. కొన్ని వ్యాఖ్యలు రాయడానికి, చెప్పడానికి కూడా వీలు కాకుండా ఉన్నాయి. మరికొన్ని వ్యాఖ్యలు కాస్తా మెతగ్గానే విమర్శనాత్మకంగా ఉన్నాయి. అయితే బాలయ్యకు మద్దతుగా కూడా కొద్ది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోస్టులు పెట్టారు. మొత్తానికి సోషల్ మీడియాలో బాలయ్య వ్యాఖ్యల పై రచ్చ రచ్చ అవుతోంది.

English summary

Telangana netizens angry on Balakrishna controversial comments