తెలంగాణ కొత్త జిల్లాలు ఇవే

Telangana new districts

05:39 PM ON 4th October, 2016 By Mirchi Vilas

Telangana new districts

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు తుది దశకు చేరుకుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, డిమాండ్లపై నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు జిల్లాల వారీగా నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఈరోజు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లా నేతలతో ముఖ్యమంత్రి చర్చించారు. ఇప్పటికే ప్రతిపాదించిన 17 కొత్త జిల్లాలతోపాటు మరో నాలుగు కొత్త జిల్లాలకు సీఎం సానుకూలత వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై నాయకుల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైందని కేసీఆర్ అన్నారు. 31 జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా కసరత్తు జరపాలని నిర్ణయించినట్లు చెప్పారు.

కొత్తగూడెం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా పేరు, వికారాబాద్ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు వికారబాద్ పేరు, మహబూబాబాద్ జిల్లా పేరును అలాగే కొనసాగించాలని సీఎం పేర్కొన్నారు. సిరిసిల్ల కేంద్రంగా ఏర్పడే జిల్లాకు రాజన్న పేరు పెట్టాలనే ప్రతిపాదన ఉన్నట్లు చెప్పారు. పెద్దపల్లి నగరపంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలని, వరంగల్ గ్రామీణ జిల్లా కేంద్రాన్ని కూడా వరంగల్ నగరంలోనే ఏర్పాటు చేయాలని, స్టేషన్ ఘన్ పూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నాలుగు జిల్లాల ప్రతిపాదనలపై కసరత్తు చేయాలని.. కేశవరావు కమిటీ నివేదిక తెప్పించుకుని తుది నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ వెల్లడించారు.

2019 ఎన్నికల్లోనూ తెరాస గెలుస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయని.. కావున మన ప్రణాళిక రాబోయే ఏడెనిమిదేళ్ల కోసం జరగాలని కేసీఆర్ అన్నారు. కాగా హైదరాబాద్ యథావిధిగా కొనసాగనుంది.

1/3 Pages

ఆసిఫాబాద్ కేంద్రంగా మరో జిల్లా


ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ లో కొత్తగా 16 మండలాలు ఏర్పాటు చేయాలన్నారు. బెల్లంపల్లి, ముథోల్ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని, క్యాతంపల్లిని నగరపంచాయతీగా మార్చాలని ఆదేశించారు. బాసర కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కొత్త జిల్లాల వివరాలిలా వున్నాయి.

English summary

Telangana new districts