తెలంగాణా కొత్త జిల్లాల జనాభా

Telangana new states population list

05:40 PM ON 16th September, 2016 By Mirchi Vilas

Telangana new states population list

తెలంగాణలో జిల్లాల పునర్య్వవస్థీకరణ అనంతరం ఏర్పడనున్న 27 జిల్లాల జనాభా గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3.50 కోట్ల జనాభా ఉండగా, ఇందులో 54.18 లక్షలు(15శాతం) ఎస్సీలు, 48.35 లక్షలు(14 శాతం) మైనారిటీలు, 32 లక్షలు(9శాతం) ఎస్టీలు. జిల్లాల పునర్య్వవస్థీకరణ అనంతరం హైదరాబాద్ అన్నింటికంటే పెద్ద జిల్లాగా ఉంది. దీని జనాభా 39.43 లక్షలు. జయశంకర్(భూపాలపల్లి) జిల్లా అతి తక్కువ జనాభాతో ఏర్పడుతోంది. ఈ జిల్లాలో జనాభా 6.54 లక్షలు మాత్రమే. అత్యధిక జనాభాలో హైదరాబాద్ తర్వాత మల్కాజ్ గిరి(24,40,073), శంషాబాద్(20,51,120) ఉన్నాయి. రాష్ట్రములో 10 లక్షలలోపు జనాభా ఉన్న జిల్లాలు 10 ఉన్నాయి.

మహబూబాబాద్ జిల్లాలో ఎస్సీలు సంఖ్యాపరంగా అతి తక్కువగా(1,00,091) వున్నారు. ఇక మల్కాజ్ గిరి జిల్లాలో మొత్తం జనాభాలో ఎస్సీలు 9 శాతమే వున్నారు. రాష్ట్రంలో మైనారిటీలు అత్యధికంగా(18,20,487) హైదరాబాద్ జిల్లాలో వున్నారు. మైనారిటీలు అత్యల్పంగా గల యాదాద్రి జిల్లాలో 47,318 మంది(5 శాతం) మాత్రమే ఉన్నారు. ఎస్టీలు ఎక్కువగా మహబూబాబాద్ జిల్లాలో వున్నారు. అక్కడ 38 శాతం జనాభా వారిదే. ఆ తర్వాత స్థానాల్లో కొత్తగూడెం(37 శాతం), ఆదిలాబాద్(35 శాతం) ఉన్నాయి. ఎస్టీలు అతి తక్కువగా పెద్దపల్లి జిల్లాలో వున్నారు. అక్కడ 14,945 మంది మాత్రమే ఎస్టీలున్నారు. ఇక రాష్ట్రంలో ఎస్సీలు అత్యధికంగా 22 శాతం మంది కొమురంభీం జిల్లాలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: బంపరాఫర్: ఆధార్ కార్డు ఉంటే రూ.1700కే 'ఐఫోన్ 7'!

ఇది కూడా చదవండి: మీరు ఎందులోనూ విజయం సాధించలేకపోతున్నారా? అయితే మీ ఇంట్లో ఇవి ఉన్నాయేమో చూడండి

ఇది కూడా చదవండి: షాకింగ్ న్యూస్: ఆమెతో చెప్పు దెబ్బలు తిన్న హీరోయిన్ రేఖ!

English summary

Telangana new states population list