ఢిల్లీలో  వైభవంగా తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలు

Telangana State Formation Day Celebrations in Delhi

10:54 AM ON 23rd November, 2015 By Mirchi Vilas

Telangana State Formation Day Celebrations in Delhi

తెలంగాణ రాష్ట్ర దినోత్సవం వైభవంగా నిర్వహించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌-2015లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెవిలియన్‌ను ఏర్పాటు చేసి, దానికి అనుబంధంగా ఆదివారం మైదాన్‌లోని లాల్‌చౌక్‌లో రాష్ట్ర దినోత్సవం పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన జానపద కళారూపాలు ఆహూతులను అలరించాయి. ముఖ్యంగా సత్యనారాయణ బృందం ప్రదర్శించిన జయ జయహే తెలంగాణ నాటకానికి మంచి స్పందన వచ్చింది. ఈ నాటకంలో నిజాం నిరంకుశ పాలనను, దానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కళ్లకు కట్టేలా ప్రదర్శించారు.

తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకూ జరిగిన పోరాట ఘట్టాలను దేశవాసులకు పరిచయం చేశారు. దాదాపు 2 వేల మందికి పైగా కార్యక్రమాలను తిలకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆనంద్‌ కుమార్‌, కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ నివాస్‌, రాష్ట్ర టూరిజం శాఖ ఎండీ క్రిస్టియానా చాంగ్దు, తెలంగాణ రెసిడెంట్‌ కమిషనర్‌ శశాంక్‌ గోయల్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ రామ్మోహన్‌ రావులు హాజరయ్యారు. మొత్తానికి డిల్లీలో తెలంగాణా ధూమ్ ధామ్ సందడి చేసింది.

English summary

India's 29th state telangana celebrates its formation day in delhi pragathi maidaan. Telangana government has exhibited the state culture,food etc