బీరు అమ్మకాల్లో తెలంగాణా దుమ్ము రేపింది(వీడియో)

Telangana state going top in beers sale

06:55 PM ON 21st June, 2016 By Mirchi Vilas

Telangana state going top in beers sale

రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణా బంగారు తెలంగాణా అయిందో లేదో గానీ బీరు విక్రయాల్లో మాత్రం తెలంగాణ టాప్ లేపింది. ఇతర దక్షిణాది రాష్ర్టాలకు అందనంత ఎత్తులో నిలిచింది. విక్రయాల్లో అగ్రస్థానంలో నిలించింది. దీంతో అధికారులను ఆశ్చర్యపోతున్నారు. బీర్లు అమ్మకాల్లో తెలంగాణ రికార్డు సృష్టించి, దక్షిణాది రాష్ర్టాల్లోనే నెంబర్ వన్ గా నిలిచింది. అది ఏ రేంజ్ లో అంటే రెండో స్థానంలో ఉన్న కేరళ కంటే కూడా రెట్టింపు స్థాయిలో అమ్మకాలు తెలంగాణలో జరిగాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో మందుబాబులు భారీగా బీర్లు లాగించేశారు. తెలంగాణలో మొత్తం 334.56 లక్షల కేసుల బీర్లు గుటకాయస్వాహా చేశారు.

సగటున మనిషికి 7.48 లీటర్ల బీరు విక్రయాలు జరిగాయి. కూల్ బీరును తాగడంలో కేరళ రెండో స్థానంలో నిలిచింది. కేరళలో సగటున 3.64 లీటర్ల మేరకు బీరు తాగారు. అంటే కేరళ కంటే తెలంగాణలో రెట్టింపు బీర్లు తాగారన్నమాట. కర్నాటక మూడో స్థానంలో నిలవగా, ఏపీ 2.72 లీటర్లతో నాలుగో స్థానంలో ఉంది. మద్యం విక్రయాల్లో మాత్రం సగటు 8.23 లీటర్లతో కర్నాటక టాప్ ర్యాంక్ లో ఉంది. సగటున 6.82 లీటర్లతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. బీరు విక్రయాల్లో అగ్రస్థానం సాధించిన తెలంగాణ మద్యం అమ్మకాల్లో 6 లీటర్ల సగటుతో మూడో స్థానంలో ఉంది.

5.47 లీటర్లతో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. మద్యం విక్రయాల్లో కేరళ మాత్రం చివరి స్థానంలో నిలిచింది. అందరినీ మందుబాబులుగా మార్చేసిన ఘనత తెలంగాణా సర్కార్ దేనని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. బంగారు తెలంగాణ మాటెలా వున్నా బీరు తెలంగాణాగా మార్చేశారంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

English summary

Telangana state going top in beers sale