అబ్బా... పిండేసింది

Telugu actress in Limca Book of records

10:31 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

Telugu actress in Limca Book of records

ఛత్రపతి, కృష్ణ, మిరపకాయ్‌ వంటి చిత్రాల్లో తన అడల్ట్ కామెడీతో గుర్తింపు పొందిన తెలుగు నటి పడాల కళ్యాణి. అబ్బా పిండేశారు, బాబీ... వంటి డైలాగ్స్‌తో కళ్యాణి మంచి ఫ్యామస్‌ అయింది. అయితే దీనికి ముందు ఈమె కరాటే కళ్యాణి, హరికథ కళ్యాణి వంటి పేర్లుతో ఫ్యామస్‌ అయింది. ఈమె తాజాగా 'లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో' చోటు సంపాదించుకుంది. వివరాల్లోకెళితే హైదరాబాద్‌లో తన ట్రూప్‌తో నాన్‌స్టాప్‌ హరికథ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చింది. 2015 లో జూన్‌ 20 నుండి 25 వరకు దాదాపు 114 గంటల 45 నిమిషాల 55 సెకండ్ల పాటు నాన్‌స్టాప్‌గా హరికధ చెప్పారు. ఈ విషయాన్ని గ్రహించిన లిమ్కా బుక్‌ ఆఫ్‌ అవార్డ్స్‌ వారు కళ్యాణి కి ఈ అరుదైన గౌరవం అందించారు. మిర్చివిలాస్‌.కామ్‌ తరుపున కళ్యాణి గారికి అభినందనలు తెలుపుతున్నాం.

English summary

Telugu character artist Padala Kalyani set record by saying nonstop of Harikatha. Due to this she got place in Limca Book of records.