జెండా మోసిన కార్యకర్తల మనోభావాలు గుర్తించాలి : చంద్రబాబు

Telugu desham meeting in Tirupathi

05:09 PM ON 14th November, 2015 By Mirchi Vilas

Telugu desham meeting in Tirupathi

పార్టీ జెండా మోసిన కార్యకర్తల మనోభావాలను గుర్తించాలని టిడిపి అధినేత , ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. టీడీపీలో అందరూ కుటుంబ సభ్యుల్లా ఉండాలని, నేతలు తమ మధ్య భేషజాలు లేకుండా వ్యవహరించాలని ఆయన అన్నారు. పటిష్ఠమైన యంత్రాంగమే టీడీపీ బలం అని చంద్రబాబు పేర్కొంటూ పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. తిరుపతిలో మేథోమథన సదస్సులో భాగంగా చివరిరోజు అయిన రెండోరోజు ఆయన మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీల అమలుకు కార్యకర్తలు కృషి చేయాలని చెప్పారు. నెలాఖరులోపు సమన్వయ కమిటీలను నియమించాలన్నారు. ముఖ్యంగా జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, జిల్లా అధ్యక్షుడి మధ్య సమన్వయం అవసరమని చంద్రబాబు స్పష్టం చేసారు. ఈ ఏడాది 40వేల మందికి నాయకత్వ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అన్ని కమిటీలు అర్ధవంతంగా పనిచేసి , ప్రజల మన్ననలు పొందాలని ఆయన సూచించారు. గ్రామ కమిటీలు ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించుకుంటూ , ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ద్రుష్టి సారించాలని ఆయన మార్గ నిర్దేశం చేసారు.

English summary

Telugu desham meeting in Tirupathi.Chandrababu naidu attended in Tirupathi meeting he gave valuable speech