కబాలిని ఆపాలని టాలీవుడ్ లో స్కెచ్...

Telugu film distributors are trying to stop Kabali movie release

10:41 AM ON 18th July, 2016 By Mirchi Vilas

Telugu film distributors are trying to stop Kabali movie release

భారీ అంచనాలతో, రజనీకాంత్ నటించిన కబాలి మూవీ ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. అందుకు సంబంధించిన సన్నాహాల్లో ప్రొడ్యూసర్స్, బయ్యర్స్ వున్నారు. కానీ తెలుగు రాష్ర్టాల్లో అందుకు పరిస్థితి భిన్నం. ఈ మూవీని తెలుగులో విడుదల కాకుండా టాలీవుడ్ కి చెందిన కొంతమంది డిస్ర్టిబ్యూటర్లు, ఓ సీనియర్ మోస్ట్ డైరెక్టర్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. వున్నట్లుండి టాలీవుడ్ లో కబాలికి ఏమైంది? ఓ డైరెక్టర్, మిగతా డిస్ర్టిబ్యూటర్లు విడుదలకు ఎందుకు మోకాలు అడ్డుతున్నారు? వంటి వివరాల్లోకి వెళ్తే.. గతంలో రజనీ మూవీలను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు చాలా వరకు నష్టపోయారట.

అది తమకు చెల్లిస్తేనే కబాలి విడుదలకు అంగీకరిస్తామంటూ మెలిక పెట్టారట. అంతేకాదు, కబాలి తెలుగు రైట్స్ విషయానికి వస్తే షణ్ముక పిక్చర్స్ దీన్ని కొనుగోలు చేశారట. ఫ్యాన్సీ రేటుకు చౌదరి హక్కులను సొంతం చేసుకున్నాడు. గతంలో రజనీకాంత్ నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్ అయ్యాయి. ఈ విషయంలో సూపర్ స్టార్ చాలా సమస్యల్ని కొని తెచ్చుకున్నాడు. ఆయా సినిమాలను కొనుగోలు చేసి, డిస్ర్టిబ్యూటర్స్ నష్టాలు చవిచూశారు. తమను ఆదుకోవాలంటూ కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ బయ్యర్స్ ఆందోళన చేపట్టిన విషయం తెల్సిందే!

ఈ విషయంలో రజనీకాంత్ వైఫ్ లత ముందుకొచ్చి బయ్యర్స్ ని కన్విన్స్ చేసింది. ఇక కబాలి మూవీకి మొదటి నుంచి యమక్రేజ్ వచ్చింది. కబాలి చిత్రంతో బయ్యర్స్ తేరుకోవడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఇక గతంలో రజనీకాంత్ సినిమాల్ని టాలీవుడ్ లో దక్కించుకున్న ఓ డైరెక్టర్, బయ్యర్స్ ఈసారి ముందుకు రాలేదు. దీంతో చౌదరి అనే ప్రొడ్యూసర్ కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ఆయనకు టాలీవుడ్ లో కొంతమంది సినీ ప్రముఖులు అడ్డంకులు సృష్టిస్తున్నట్లు ఇన్ సైడ్ వినిపించే టాక్. కబాలి థియేటర్స్ కు రావడానికి సమయం దగ్గర పడుతోంది.

1/5 Pages

వివాదానికి తెరపడుతుందా?


కాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి మూవీ తెలుగు వెర్షన్ పై సరికొత్త వివాదం రేగి, ఈ సినిమా విడుదలకు టాలీవుడ్ లో కొందరు అడ్డుపడుతున్నారంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి తన పోస్టర్ ని తెలుగు డిస్ట్రిబ్యూటర్ కౌన్సిల్ సభ్యుడు రాందాస్ ఆపారంటూ పంపిణీదారుడు కృష్ణప్రసాద్ చౌదరి ఆరోపించారు. రూ.3 కోట్లు డిపాజిట్ పెట్టాలని రాందాస్ డిమాండ్ చేశారని ఆయనన్నారు. అసలు.. నా సినిమా పేపర్ యాడ్ ని ఎందుకు ఆపారు? అని ఆయన నిలదీశారు.

English summary

Telugu film distributors are trying to stop Kabali movie release