'హాలీవుడ్' నుండి రీమేక్ చేసిన తెలుగు చిత్రాలు!!

Telugu movies that were remake from Hollywood

04:01 PM ON 9th February, 2016 By Mirchi Vilas

Telugu movies that were remake from Hollywood

మన టాలీవుడ్ లో ఎన్నో వేల చిత్రాలు వచ్చాయి. ఇందులో ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే ఒకప్పుడు కాలంలో దర్శకులు కొత్తగా కథలు సృష్టించే వారు. ఎన్నో ఫ్యాంటెసీ చిత్రాలు తెరకెక్కించే వారు. అవన్నీ సూపర్ హిట్లే. కానీ ఇప్పుడు దర్శకులు మాత్రం వేరు. వేరే భాషలో సూపర్ హిట్ అయిన చిత్రాలని తీసుకు వచ్చి మన తెలుగు నేటివిటి కి అనుగుణంగా మార్చి చిత్రీకరించి విజయాలు అందుకుంటున్నారు. అలా మన తెలుగు దర్శకులు హాలీవుడ్ నుండి తెలుగు లోకి రీమేక్ చేసిన 20 చిత్రాలు మీకు అందిస్తున్నాం చూసి తెలుసుకోండి. 

1/21 Pages

1. ఖైదీ(1983)-(ఫస్ట్ బ్లడ్)


చిరంజీవికి స్టార్ ఇమేజ్ ని తెచ్చి పెట్టిన 'ఖైదీ' చిత్రం హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఫస్ట్ బ్లడ్ చిత్రం నుండి రీమేక్ చేసింది. హాలీవుడ్ లో సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన పాత్రలో తెలుగు లో చిరంజీవి నటించాడు. తన జీవితాన్ని నాశనం చేసిన విలన్ ని హీరో ఎలా పగ తీర్చుకున్నాడు అనే కథ తో తెరకెక్కిన ఈ చిత్రం హాలీవుడ్ లో సూపర్ హిట్ అయింది. అయితే ఇదే కథాంశాన్ని తెలుగు లోకి తీసుకున్నా, కొన్ని సన్నివేశాల్ని మార్చి, మన తెలుగు నేటివిటి కి అనుగుణంగా మార్చి తెలుగు లోకి అనువదించారు. తెలుగు లో ఈ చిత్రానికి ఎ. కోదండ రామి రెడ్డి దర్శకత్వం వహించగా చిరంజీవి సరసన మాధవీ కధానాయికగా నటించింది. 

English summary

Top Telugu movies that were remake from Hollywood stories.