ఫేస్ బుక్ తో  తెలుగు విద్యార్ధుల తిరుగు టపా 

Telugu Students Booked In America Through Facebook

01:22 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Telugu Students Booked In America Through Facebook

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఫేస్ బుక్ సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి, చివరకు ఉద్యోగాలు సంపాదించడాని కే కాదు ఒకోసారి కొంప ముంచడానికి కూడా కారణంగా మారుతోంది. తాజాగా ఫేస్ బుక్ తెలుగు విద్యార్థుల అమెరికా కలలను తారుమారు చేసి న వైనం వెలుగు చూసింది. ఫేస్‌బుక్‌లో స్నేహితులకు పంపిన సమాచారం చివరి నిమిషంలో వారిని స్వదేశానికి తిరుగు టపా చేసేసింది. ఇదేమిటని ఆశ్చర్య పోతున్నారా? అయితే ఏమాత్రం సందేహం లేకుండా ఫేస్ బుక్ సాక్షిగా ఇది జరిగింది. ఓసారి వివరాల్లోకి వెళితే ,

పదుల సంఖ్యలో విద్యార్థులను అమెరికా అధికారులు వెనక్కి తిప్పి పంపడానికి ఫేస్‌బుక్కే దోహదపడిందని అంటున్నారు. భారత్ నుంచి అందునా తెలుగు రాష్ట్రాల నుంచి వందల మంది విద్యార్ధులు కేవలం ఆ రెండు విశ్వవిద్యాలయాలనే.ఎందుకు ఎంచుకుంటున్నారనే అనుమానంతో అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఇన్వెస్టి గేటివ్ తరహాలో చకచకా తెలుగు విద్యార్థుల ఫేస్‌బుక్‌లను తనిఖీ చేసేసారట. అందులో అమెరికాలో చదువుకోవడానికి అవసరమైన డబ్బును బ్యాంకు ఖాతాలో ఉండేలా ఏమి చేసారో , ఇతర స్థిరాస్తులు ఉన్నట్లుగా ఎలా చూపించారో తదితర విషయాలను స్నేహితులతో ఎలా పంచుకున్నారో తేటతెల్లం అయిపొయింది. ఇంకేముంది .... వాటిని చూసిన ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వెంటనే విద్యార్థులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించి వెనక్కి సాగనంపేసారు.

వాస్తవానికి ‘ఇమ్మిగ్రేషన్‌ అధికారుల తనిఖీలు నిత్యం ఉండేవే. ఇప్పటివరకు కేవలం ఏ విశ్వవిద్యాలయానికి, ఏ కోర్సు, టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌ స్కోరెంత? లాంటి మూడునాలుగు ప్రశ్నలు వేసి పంపించేవారు.. అయితే అనుమానం వచ్చిన అధికారులు ఈసారి క్షుణ్నంగా తనిఖీ చేయడంతో నిర్వాకం బయట పడింది. మొత్తానికి ఫేస్ బుక్ మాటున సాగే వ్యవహారాలు తెలుగు విద్యార్ధుల పాలిట సాపమయ్యాయి. ఏ పుట్టలో ఏపాము ఉన్నదో అని ఊరకే అన్నారా మరి.

English summary