సీసీఎల్‌-6 విజేత గా తెలుగు వారియర్స్‌

Telugu Warriors won CCL 6 Title

10:28 AM ON 15th February, 2016 By Mirchi Vilas

Telugu Warriors won CCL 6 Title

సెలెబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ (సిసిఎల్) లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ తెలుగు వారియర్స్‌ ఫైనల్లో రెండోసారి విజేతగా నిలిచింది. అదిరిపోయే విధంగా కర్ణాటక బుల్డోజర్స్‌ను మట్టికరిపించింది. ఉప్పల్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 208 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన అఖిల్‌ అక్కినేని సారథ్యంలోని తెలుగు వారియర్స్‌ జట్టు ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 17.4 ఓవర్లలో 211 పరుగులతో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు సచిన్‌ జోషి (114: 49 బంతుల్లో), ప్రిన్స్‌ (61 నాటౌట్‌: 43 బంతుల్లో) తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయానికి బాటలు వేశారు. చివర్లో సచిన్‌ జోషి ఔటైనా.. కెప్టెన్‌ అఖిల్‌ అక్కినేని 25 పరుగులతో ధాటిగా ఆడి గెలుపు లాంఛనాన్ని బౌండరీతో పూర్తి చేసాడు. తెలుగు అభిమానులను ఆనందంలో తేలియాడించాడు. ఇక మ్యాచ్‌ను వీక్షించేందుకు సినీ తారలు ఉప్పల్‌ స్టేడియానికి తరలివచ్చారు. తెలుగు వారియర్స్‌ మెంటార్‌ వెంకటేశ్‌, నాగార్జున, రానా, రెజీనా, అదా శర్మ, తాప్సీ, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తదితరులు సందడి చేశారు. అన్నట్టు తెలంగాణ మంత్రి కె టి ఆర్ కూడా విచ్చేసి మ్యాచ్ తిలకించారు.

English summary

Telugu warriors won Celebrity Champions League (CCL 6) for the second time.Telugu warriors won the final match against Karnataka Bulldozers which was held in Hyderabad Uppal Stadium.