తెలుగు మహిళకు రోడ్డుమీదే నరకం చూపించారు

Telugu women investigated by police in US

06:48 PM ON 30th January, 2017 By Mirchi Vilas

Telugu women investigated by police in US

అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ వచ్చిన వెంటనే, వలసదారుల్లో ఆందోళన మొదలైంది. అక్కడి ఓ తెలుగు మహిళకు ఇటీవల చేదు అనుభవం ఎదురైంది. 47 ఏళ్ళ అరవింద పిల్లలమర్రి అనే మహిళ మేరీ ల్యాండ్ లో తన ఇంటివద్ద వాకింగ్ చేస్తుండగా పోలీసులు ఆమెను అడ్డుకుని పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. సుమారు 30 సంవత్సరాల క్రితమే ఈమె తలిదండ్రులు ఇండియా నుంచి అమెరికా వెళ్ళారు.

ఆలాంటి ఆమెను పట్టుకుని, నీపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని, ఇక్కడి నుంచి వెళ్ళ లేవని బెల్-ఎయిర్ పోలీసు అధికారి ఒకరు ఆమెను గద్దించాడు. ఈ అనుభవాన్ని ఆమె తన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంది.

‘నీ గుర్తింపు చూపు అని ఆ అధికారి డిమాండ్ చేశా డు.. కంప్యూటర్ లో తన వివరాలన్నీ చూశాకే తనను వదిలిపెట్టాడు. ‘నా సమాధానాలన్నీ విని కూడా నన్ను అనుమానిస్తూ చాలాసేపు ప్రశ్నలతో వేధించారు’ అని అరవింద పిల్లలమర్రి పేర్కొంది. దీనిపై నెటిజన్లు గరం గరం గా వున్నారు.

ఇది కూడా చూడండి: 840 ఏళ్ల క్రితం ఇక్కడే పుట్టానని., అప్పటి స్మృతులు ప్రస్తావిస్తున్న భూటాన్ యువరాజు.!

ఇది కూడా చూడండి: కుండీలో చెత్త వేయండి - ఫ్రీ వైఫై ఇంటర్నెట్ పొందండి

English summary

Telugu women grilled by police in US she is walking on morning time police stopped her and investigated for a long time after looking her details in computer they left her.