తెలుగుదేశం ఎప్పుడూ ప్రజా పక్షమే

Telugudesam always work for people

11:51 AM ON 13th November, 2015 By Mirchi Vilas

Telugudesam always work for people

అధికారంలో వున్నా , ప్రతిపక్షంలో వున్నా తెలుగుదేశం ఎప్పుడూ ప్రజా పక్షమేనని ఆంధ్రప్రదేశ్ టిడిపి అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. తిరుపతిలో రెండురోజుల పాటు నిర్వహించనున్న దిశా నిర్దేశం సదస్సు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. పార్టీ ఎంపిలు , ఎంఎల్ఎలు , ఎంఎల్సిలు , కేంద్ర - రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో రాష్ట్రాన్ని ఆర్ధికంగా , పారిశ్రామికంగా , వ్యావసాయకంగా , ఉపాధి పరంగా అభివృద్ధి చేయగలరన్న నమ్మకంతో ప్రజలు టిడిపికి పట్టం కట్టారని ఆయన పేర్కొంటూ , ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సిఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. అయితే రాజకీయ నిరుద్యోగుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

English summary

Telugudesam always work for people.telugudesam working very hard to develop ap after dividing from telengana