'టెంపర్‌' సీక్వెల్‌ కన్ఫార్మ్‌

Temper sequel confirmed

05:24 PM ON 6th February, 2016 By Mirchi Vilas

Temper sequel confirmed

వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న యంగ్‌ టైగర్‌ కి 'టెంపర్‌' తో సూపర్‌హిట్‌ అందించిన డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌. ఒకప్పుడు పీక్స్‌ స్టేజ్‌లో ఉన్న ఎన్టీఆర్‌కి 'ఆంధ్రావాలా' తో ఫ్లాప్‌ ఇచ్చిన పూరీ ఫ్లాప్‌ల్లో ఉన్న ఎన్టీఆర్‌కి సూపర్‌హిట్‌ ఇచ్చి లెక్క సరి చేశాడు. ఇప్పుడు పూరీ నందమూరి బ్రదర్స్‌తో వేరువేరుగా చిత్రాలు చెయ్యడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇప్పించుకున్నాడు. కళ్యాణ్‌ రామ్‌ సంగతి పక్కన బెడితే 'టెంపర్‌' రిలీజ్‌ సమయంలో ఎన్టీఆర్‌ తో మళ్లీ 'టెంపర్‌ -2' తీస్తానని చెప్పాడు పూరీ. అప్పుడు ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్‌తో చిత్రం ఒకే కాగానే ఇది 'టెంపర్‌ -2' అనే అనుకుంటున్నారంతా.

అయితే ఇది టెంపర్‌ కి సీక్వెలా లేక మరేదైనానా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్‌' లో నటిస్తున్నాడు. ఇది అయిపోయాక ఎన్టీఆర్‌ పూరీ డైరెక్షన్‌లో నటించే అవకాశాలున్నాయి. ఈలోపు పూరీ కళ్యాణ్‌ రామ్‌తో చిత్రాన్ని తెరకెక్కించేయవచ్చు.

English summary

Young tiger Ntr super hit movie Temper is directed by Puri Jagannadh. Now Puri want to take sequel of Temper with Ntr.