గుడిలోనే రాసలీలలు.. అడ్డంగా దొరికిన ఉద్యోగి(వీడియో)

Temple employe caught red handedly while having romance with women

06:03 PM ON 1st April, 2016 By Mirchi Vilas

Temple employe caught red handedly while having romance with women

కామంతో కళ్ళు మూసుకుపోతే.. అది గుడా, బడా, దేవాదాయ శాఖ సత్రమా అనే తేడా తెలియదు... మనం పనిచేసేది పవిత్రమైన ఆలయంలో ఉద్యోగం అనే స్ఫ్రుహ కోల్పోయి అపచారం చేసిన వైనం ఇది... మందు కొట్టి మహిళతో రాసలీలకు అతడికి గుడే దొరికిందా అంటూ పలువురు మండిపడుతున్నారు. వెంకటేశ్వరస్వామి సత్రంలో మహిళతో రాసలీలలు చేస్తూ, దేవాలయం ఉద్యోగి అడ్డంగా దొరికిపోయాడు ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన విశాఖ జిల్లాలోని నక్కపల్లిలో చోటు చేసుకుంది. ఉపమాక వెంకటేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన సత్రంలో బుధవారం రాత్రి ఈ ఘటన బయటపడింది.

ఇది కూడా చదవండి: అనుష్క ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోబొతున్న ప్రభాస్?

వివరాల్లోకి వెళ్తే, కొద్దిరోజులుగా ఈ సత్రంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలుసుకున్న స్థానికులు.. బుధవారం రాత్రి కాపు కాసారు. టెంపుల్ ఎంప్లాయ్ ఒక మహిళతో రాసలీలలో మునిగిపోయాడు. ఆ ఫోటోలు, వీడియోలను కొందరు సెల్‌ఫోన్లతో చిత్రీకరించారు. ఈ తతంగంలో మొత్తం ముగ్గురు ఆలయ సిబ్బంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు టీటీడీ ఉద్యోగి వెంకట రమణమూర్తిగా గుర్తించారు. టీటీడీ ఆధ్వర్యంలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్వహణ కొనసాగుతోంది. ఈ ఆలయానికి ఆపోజిట్‌లో రోడ్డుపక్కన సత్రం ఉంది. స్వామివారి కల్యాణోత్సవాల సందర్భంగా టీటీడీ నుంచి వచ్చిన సిబ్బందికి ఇక్కడ వసతి కల్పించారు.

ఇది కూడా చదవండి: శృంగార కథానాయికలు అసలు ఎన్నిరకాలో తెలుసా?

ఉత్సవాల అనంతరం సిబ్బంది వెళ్లిపోయారు. బుధవారం రాత్రి సత్రంలోకి విధులు నిర్వహించే సిబ్బంది ఒక మహిళను తీసుకు వచ్చారు. టీటీడీ ఉద్యోగి వెంకట రమణ మూర్తితో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు రాత్రంతా మద్యం సేవించి ఆ మహిళతో రాసలీలలు కొనసాగించినట్టు తెలుస్తోంది. అయితే దీని పై దర్యాప్తు జరిపించి బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని టీటీడీ డిప్యూటీ ఈఓ చెంచులక్ష్మి ప్రకటించారు. దేవాలయ సత్రంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు తగిన శాస్తి జరగాలని శాపనార్ధాలు పెడుతున్నారు.


English summary

Temple employe caught red handedly while having romance with women. In Vishaka temple employee have sex with women in temple.