‘అమ్మ’కు గుడి

Temple For Tamilnadu CM jaya Lalitha

04:53 PM ON 29th February, 2016 By Mirchi Vilas

Temple For Tamilnadu CM jaya Lalitha

తమిళనాట ముఖ్యమంత్రి జయలలిత క్రేజ్ అంతాఇంతా కాదుగా... అమ్మగా ఆరాధిస్తారు ... దేవతగా కొలుస్తారు. ఇప్పుడు ఏకంగా అమ్మ పై అభిమానంతో ఓ వ్యక్తి గుడి కట్టేస్తున్నాడు. తమిళనాడులోని విరుగంబాక్కం నియోజకవర్గంకు చెందిన ఎంజీఆర్‌ యువ విభాగం సంయుక్త కార్యదర్శి పి.శ్రీనివాసన్‌ వెల్లూర్‌కు 60కి.మీ.ల దూరంలోని ఇయోప్పాడు గ్రామంలో జయలలిత గుడికి శంకుస్థాపన చేసేసాడు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన చెన్నైకి చెందిన శ్రీనివాసన్‌ 2008లో కొన్న తన సొంత భూమిలో ‘అమ్మ ఆలయ’ నిర్మాణానికి నడుంకట్టాడు. పుష్కర కాలం క్రితం అంటే 2004లో అన్నాడీఎంకే పార్టీలో చేరిన శ్రీనివాసన్‌, జయలలిత తమకు దేవత లాంటిదని, ఆమెపై అభిమానం చాటుకోవడానికి గుడి కడుతున్నామని అంటున్నాడు. 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.50లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ గుడి నిర్మాణం ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలని లక్ష్యమట. ఇక అమ్మపై అభిమానంతో ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చేవాళ్ళూ ఇవ్వొచ్చు అంటూ ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చేసాడు. ఒకవేళ ఎవరైనా ఇవ్వకపోతే, అమ్మ దృష్టిలో పెడతాడన్న భయంతో నైనా విరాళం ఇస్తారు గా అంటూ పలువురు గుసగుసలాడు కొంటున్నారట.

English summary

Jaya lalitha has huge craze over Tamilnadu.She was also called as Amma in Tamilnadu.A man named P.Srinivasan who belongs to Vellore was a big fan of Tamilnadu Chief Minister Jaya Lalitha.He has joined in AIDMK party in 2004.He decided to build temple with the huge ammount of 50 lakhs.He announced that any one can give donations to build this temple for Jaya Lalitha.