14 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న సర్వమత మందిరం...

Temple of all religions

12:58 PM ON 2nd September, 2016 By Mirchi Vilas

Temple of all religions

ఒక్కొక్కరు ఒక్కో దేవుడిని పూజిస్తారు. హిందువులు దేవాలయాల్లో పూజలు చేస్తారు. ముస్లింలు మసీదులో నమాజ్ చేస్తారు. క్రిస్టియన్లు చర్చిలో ప్రార్థనలు చేస్తారు. ఇలా ప్రతీ మతానికి ప్రత్యేక ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. కానీ భిన్న మతాలకు చెందిన ప్రార్థనామందిరాలన్నీ ఒకే భవనంలో ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇది ఎక్కడ అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.. రష్యాలోని కజన్ నగరంలో ఇడర్ ఖానొవ్ అనే సంఘ సంస్కర్త టెంపుల్ ఆఫ్ రెలిజియన్స్ ని నిర్మించాడు. భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబింబించేలా మతాలన్నింటినీ ఒకే చోటుకు తీసుకురావాలని భావించాడు. ఆలోచన వచ్చిందే తడవుగా 1992లో భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు.

వివిధ మతాల ప్రార్థనామందిరాల గోపురాలు ఎలా ఉంటాయో అలానే అన్నీ ఒకే భవనంపై దర్శనమిచ్చేట్టు నిర్మించాడు. ఈవిధంగా దాదాపు 16 మతాలకు సంబంధించిన గోపురాలు నిర్మించాడు. ఇంకా ఇప్పటికీ భవన నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ భవనాన్ని పర్యాటకులు చూసేందుకు అనుమతించట్లేదు. త్వరలోనే భవన నిర్మాణం పూర్తిచేసి సందర్శనార్థం ఉంచుతారట. అయితే అసలు విషయం ఏంటంటే ఆ భవనంలో ఏ మతానికి సంబంధించిన ప్రార్థనలూ జరగవు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపిస్తున్న ఖానొవ్ ఆలోచన నిజంగా మెచ్చుకోతగ్గదేనంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇది కూడా చదవండి: దెయ్యాలు నివాసముండే ఫేమస్ సిటీస్ ఇవే!

ఇది కూడా చదవండి: కోకాకోలా ప్లాంట్ లో భారీగా దొరికిన కొకైన్.. దాని ఖరీదు తెలిస్తే దిమ్మతిరుగుద్ది..

ఇది కూడా చదవండి: గ్రూప్ -2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ

English summary

Temple of all religions. Temple of all Religions is in Russia Kazan city.