టెంపుల్ రన్ 2 వాలెంటైన్స్ డే స్పెషల్

Temple Run 2 New Valentines Day Special Update

01:06 PM ON 11th February, 2016 By Mirchi Vilas

Temple Run 2 New Valentines Day Special Update

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగదారులు ఆడే గేమ్ టెంపుల్ రన్ 2. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఈ గేమ్ కొత్త లుక్‌తో వస్తోంది. వాలెంటైన్స్ డేను పురస్కరించుకుని దీన్ని పూర్తిగా గులాబీ రంగు థీమ్‌తో అప్‌డేట్ చేసింది. ఈ కొత్త అప్‌డేట్‌ను యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి పొందవచ్చు. ఆండ్రాయిడ్ 2.3 ఆపైన వెర్షన్ కలిగిన డివైస్‌లలో ఈ గేమ్ ఇన్‌స్టాల్ అవుతుంది. కేవలం వాలెంటైన్స్ డే థీమ్ మాత్రమే కాకుండా కొత్త అప్‌డేట్‌లో మరిన్ని ఫీచర్లను యూజర్లకు అందిస్తున్నారు. పాత దాంట్లో ఉన్న పలు సాఫ్ట్‌వేర్ బగ్స్‌ను తొలగించడంతోపాటు మరిన్ని నూతన రన్నింగ్ క్యారెక్టర్లను కొత్తదాంట్లో ఏర్పాటు చేశారు. అదేవిధంగా హెచ్‌డీ స్మార్ట్‌ఫోన్లకు అనుగుణంగా గేమ్ గ్రాఫిక్స్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కొత్త అవరోధాలు, పవరప్స్, స్పెషల్ పవర్స్ వంటి వాటిని కూడా అందిస్తున్నారు.

English summary

Most Popular Smartphone game Temple Run 2 has released its new Valentines day update.In this update it added some new features to the game like Beautiful new graphics,Bigger Monkey etc