బక్కచిక్కిన గోదారి-బయటపడ్డ ఆలయాలు

Temples found in Godavari river

11:18 AM ON 28th March, 2016 By Mirchi Vilas

Temples found in Godavari river

 కరువుతో కొందరు అల్లాడుతుంటే, బయట పడ్డ ఆలయాలతో పర్యాటకులకు సందడిగా మారింది ఆ ప్రాంతం. నవ్వాలో ఏడవాలో తెలియని వింత పరిస్థతి ఇది... ఇంతకీ విషయమేమంటే, ఎన్నాడూ లేనంతగా గోదావరి బక్కచిక్కింది. జీవనదిగా చెప్పుకునే గోదారి.. ఎపుడూ లేనంత వర్షాభావంతో జలకళ తగ్గి బోసిపోయింది. కరువు కూడా తాండవిస్తోంది. అయితే ఇక్కడో గమ్మత్తైన విషయం ఉంది. గొదావరినీటి ప్రవాహం తగ్గటంతో నది లోపల ఎన్నో దశాబ్దాలుగా మునిగిపోయి కనపడకుండా పోయిన కొన్ని దేవాలయాలు మహారాష్ట్రలో బయట పడ్డాయి. అవి పురాతన కాలం నాటి శివ.. విష్ణు దేవాలయాలు.

ఇది కూడా చదవండి: చిరుని పార్టీ ఇచ్చి పడగొట్టిన అల్లుడు

ఇదికూడా చదవండి: బికీనీ వేసిందని టీచర్ ఉద్యోగం పీకేసారు.. ఆ పై వ్యభిచారిగా..

1/3 Pages

బయటపడ్డ ఆలయాలు ఇవే:

వేసవి కాలంలో గోదారి ఉధృతి తగ్గినప్పుడు ఆలయ గోపురాలు కనిపించటం మామూలే అయినా.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా గుడి మొత్తం స్పష్టంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని చందోరిలో ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యం. బయట పడిన ఆలయాలను చూడ్డానికి పర్యాటకులు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా ఏర్పడుతుందని.. గడిచిన మూడు దశాబ్ధాలలో ఈ పరిస్థితి చోటు చేసుకోలేదని.. దీన్ని బట్టి గత వర్షాకాలంలో వర్షాభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుందని అన్నారు. తాజాగా బయటపడిన దేవాలయాలు పదమూడో శతాబ్దంలో నిర్మించినవని.. నాసిక్ ను పాలించిన పేష్వాల కాలంలో వీటిని నిర్మించి ఉంటారని అంచనా వేస్తున్నారు.

English summary

Temples found in Godavari river. Lord Siva and Vishnu temples found in Nasik River at Maharashtra.