కళ్లెదుటే ప్రాణం పోతున్న పట్టించుకోని లోకం!(వీడియో)

Tempo Hits Man And Died Caught On CCTV Camera in Delhi

12:44 PM ON 12th August, 2016 By Mirchi Vilas

Tempo Hits Man And Died Caught On CCTV Camera in Delhi

పూర్వం పక్కవాడికి ఏదైనా జరిగితే చటుక్కున స్పందించే గుణం ఉండేది. కానీ నేటి మనుషుల్లో పక్కన ఏం జరుగుతున్నా తనకేం అన్నట్లు వ్యవహ రించడం పెరిగిపోయింది. ఫలితంగా మానవత్వం మంటగలిసి పోతోంది. ఇందుకు ఎగ్జాంఫుల్ ఓ ఘటన చూద్దాం. సాటి మనిషి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా ఓ ఒక్కరూ కాసింత కనికరం చూపలేదు. పైగా బాధితుడి వద్దకి ఓ వ్యక్తి వచ్చి పక్కనున్న ఫోన్ తీసుకొని వెళ్లిపోయాడు. దాదాపు 4 గంటలపాటు అతడు అలాగే రోడ్డు మీద పడి కొట్టుకుంటూ ఉన్నాడు. రైట్ టైమ్ లో సరైన ట్రీట్ మెంట్ లేక చివరకు అతడు చనిపోయాడు.. ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.

వివరాల్లోకి వెళ్తే, బెంగాల్ కు చెందిన 35 ఏళ్ల మతిబుల్ అనే వ్యక్తి ఢిల్లీలోని తీహార్ సమీపంలో వుంటున్నాడు. తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో ఇంటికి నడిచి వెళ్తుండగా.. టెంపో అతడ్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మతిబుల్ తీవ్రంగా గాయపడి అక్కడే మృతి చెందాడు.

ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్ , కిందికి దిగి చూసి వెంటనే వెళ్లిపోయాడు. 3 గంటలకు ప్రమాదం జరిగితే ఉదయం ఏడు వరకు ఎవరూ పట్టించుకోలేదు. పక్కనుండే చాలామంది నడుచుకుంటూ వెళ్లిపోయారు. సుభాష్ నగర్ రోడ్డుపై ఓ వ్యక్తి పడివున్నాడని పోలీసులకు ఫోన్ రావడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకునే లోపు బాధితుడు చనిపోయాడు. మృతదేహాన్ని పరీక్షకు ఆసుపత్రికి తరలించారు. వ్యాన్ డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ తతంతగమంత సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. ఈ యవ్వారంపై వీరలెవెల్లో సోషల్ మీడియాలో ఉతికి ఆరేస్తూ, కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి: నవ గ్రహాలను శాంతి జరిపిస్తే ఏమౌతుందో తెలుసా ?

ఇవి కూడా చదవండి:10 వేల గదులు, 70 రెస్టారెంట్లు, 4 హెలీప్యాడ్లు.. కానీ సిటీ కాదు!

English summary

A Tempo car driver hits a walking passenger and leaves him on the spot and no one recognized him and he was died after hitting by the Tempo and the whole thing was caught in CCTV Camera.