10 ఏళ్ల పాపను రేప్ చేసి, ఆపై బండరాయితో కొట్టి చంపేశాడు

Ten Year Old Girl Raped and Murdered

11:24 AM ON 4th July, 2016 By Mirchi Vilas

Ten Year Old Girl Raped and  Murdered

ఏరోజు చూసినా ఏదో ఓ దారుణం వెలుగు చూస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్ లోని బొల్లారం పోలీసు స్టేషన్ పరిధిలో మోరోఘోరం చోటుచేసుకుంది. తల్లి దండ్రులు కూలి పనులకు వెళ్లడంతో వారి పదేళ్ళ బాలికకు అనిల్ కుమార్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు. ఆ చిన్నారిపై అత్యాచారం చేసాడు. అంతటితో ఊరుకోలేదు, తన నేరం ఎక్కడ బయటపడుతుందోనని భయపడ్డాడు. అంతే అతగాడు ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా బండ రాయితో కొట్టి చంపేశాడు. అక్కడినుంచి పారిపోయాడు. పాపకు తల్లిదండ్రులు వెతుకుతుంటే విషయం బయట పడింది. నిర్మానుష్య ప్రదేశంలో పడి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు, పరారీలో ఉన్న అనిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను అనిల్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లడం సిసి ఫుటేజ్ లో రికార్డ్ అయింది. అయితే ఈ నేరగాడి మీద ఇదివరకే కొన్ని పోలీసు స్టేషన్లలో కేసులు నమోదై ఉండడమే కాక, పలు నేరాల్లో శిక్ష కూడా పడిందని అంటున్నారు. 5 హత్య కేసులు ఉన్నాయని ఇటీవలే విడుదలై, ఈ దారుణానికి ఒడిగట్టాడని పలువురు అంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: ఈ ఫుడ్స్ తో గర్భం త్వరగా పొందవచ్చు

ఇది కూడా చూడండి: శ్రీహరి మృతికి అసలు కారణం చెప్పిన భార్య

ఇది కూడా చూడండి: విక్టరీ వెంకటేష్ భార్య గురించి మీకు తెలియని కొన్ని రహస్యాలు

English summary

Ten Year Old Girl Raped and Murdered in Hyderabad.