ఓడిపోతే దానికి సై అంటూ ట్వీట్ చేసిన టెన్నిస్ స్టార్... చివరికి ఏమైంది

Tennis star promised to date after losing match

11:05 AM ON 8th February, 2017 By Mirchi Vilas

Tennis star promised to date after losing match

పందెం కాస్తే, దానివలన వచ్చే పరిణామాలు విచిత్రంగా, ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి ప్రమాద కరంగా కూడా ఉంటాయి. అందుకే ఆచి తూచి వ్యవహరించాలని అంటారు పెద్దలు. ఇది తెలియక కెనడాకి చెందిన టెన్నిస్ స్టార్ ఎగోనీ బౌచర్డ్ సోషల్ మీడియాలో చిత్రమైన బెట్టింగ్ కాసి చిక్కుల్లో పడింది. డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్ లో 45వ స్థానంలో కొనసాగుతున్న ఈ అమ్మడు.. ఆదివారం సరదాగా సూపర్ బౌల్ ఆటపై బెట్టింగ్ కాసింది. అయితే ఆమె చెప్పిన జట్టు గెలవకపోతే తనతో డేటింగ్ కి వచ్చేందుకు సిద్ధమా అని మరోవ్యక్తి పంపిన ట్వీట్ సవాలుకు సైతం సరేనంది. అట్లాంటా ఫాల్కన్స్, న్యూ ఇంగ్లండ్ పాట్రియోట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో.... అట్లాంటా విజయం సాధిస్తుందంటూ బౌచర్డ్ ట్వీట్ చేసింది. ఇంతలో ఆమె అభిమాని ఒకరు కలగజేసుకుని... ‘‘ఒకవేళ అట్లాంటా ఓడిపోయి... పాట్రియోట్స్ గెలిస్తే నాతో డేటింగ్ కి వస్తావా’’ అని ట్వీట్ చేశాడు. అందుకామె సరేనంటూ సవాల్ విసిరింది. తొలి రౌండ్ లో అట్లాంటా జట్టు 28-3 స్కోరుతో ఆధిక్యంలో ఆమె ధీమాగా ఈ బెట్టింగ్ కాసింది. అయితే సెకండ్ ఆఫ్ లో చెలరేగిపోయిన న్యూ ఇంగ్లండ్ పాట్రియోట్స్ 34-28 తేడాతో అట్లాంటాపై విజయం సాధించింది. అంతే... నోరెళ్లబెట్టడం బౌచర్డ్ వంతయింది. అయితే అభిమానికిచ్చిన మాటకు కట్టుబడి తాను డేటింగ్ వెళ్తానని ఆమె చెప్పడం కొసమెరుపు.

ఇది కూడా చూడండి: గ‌ర్భిణీ స్త్రీలు బంగారం ధరిస్తే అలా అవుతుందా?

ఇది కూడా చూడండి: శ్రీరాముని కుమారులు కట్టించిన 4నగరాలు పాకిస్థాన్ లో ఉన్నాయా

English summary

Canada tennis star Eugenie Bouchard tweeted that if she lose the match she promised to go on date.