ఫ్రాన్స్ లో మళ్లీ మారణహోమం

Terror attack in France

11:31 AM ON 15th July, 2016 By Mirchi Vilas

Terror attack in France

ఫ్రాన్స్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. టెర్రరిస్టులు మరోసారి చెలరేగిపోయారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే సందర్భంగా నీస్ నగరంలో సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఓ ట్రక్కు మృత్యుశకటంలా ప్రజల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో 42 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనను ఉగ్రదాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రక్కులోని వ్యక్తులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. దీంతో ట్రక్కు బుల్లెట్లతో తూట్లు పడిపోయింది. ఘటన జరిగిన వెంటన ఉగ్రవాద వ్యతిరేక దళాలు నీస్ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

నీస్ నగరంలో జాతీయ దినోత్సవం.. బాస్టిల్ డే ఉత్సవాల్లో పాల్గొన్న జనాలపైకి పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రితో నింపిన ట్రక్కు దూసుకెళ్లింది. ఉత్సవాల్లో భాగంగా బాణాసంచా వెలుగులను చూస్తూ సంబరాల్లో మునిగి తేలుతున్న జనం మీదికి ఉగ్రవాదులు అతివేగంతో ట్రక్కును నడిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ట్రక్కు డ్రైవర్ మృతి చెందాడు. తప్పించుకొని రెస్టారెంట్ లో నక్కిన మరో ఉగ్రవాదిని కూడా భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. గత ఎనిమిది నెలల్లో ప్రాన్స్ లో జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. గత ఏడాది నవంబర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో 130మంది మరణించగా, అనేకమంది గాయపడిన సంగతి తెలిసిందే.

తాజా ఘటనలో నీస్ నగరమంతా భీతావహంగా మారింది. ఫ్రాన్స్ సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ట్రక్కు దూసుకుపోయిన ప్రాంతంలో కుప్పలుగా మృతదేహాలు పడి ఉన్నాయి. క్షతగాత్రులకు వైద్యసేవలు కొనసాగుతున్నాయి. నగరంలో ఎవరూ ఇళ్లనుంచి బయటకు రావద్దని నీస్ నగర మేయర్ క్రిస్టియన్ ఈస్ర్టోసీ కోరారు. ఈ ఉగ్రదాడిని ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండిచాయి. మృతులకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతాపం తెలిపారు.

1/5 Pages

English summary

Terror attack in France