దారుణం: న్యూ ఇయర్ వేడుకల్లో నరమేధం

Terrorist Attack At Nightclub In Istanbul

11:36 AM ON 2nd January, 2017 By Mirchi Vilas

Terrorist Attack At Nightclub In Istanbul

ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగితేలుతున్న సమయంలో టర్కీలో జరిగిన దారుణం ఉలిక్కిపడేలా చేసింది. టర్కీ ప్రధాన నగరమైన ఇస్తాంబుల్ లో శనివారం రాత్రి పొద్దుపోయాక ఓ ఉగ్రవాది నరమేధానికి పాల్పడ్డాడు. రీనా అనే నైట్ క్లబ్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో సుమారు 35 మంది మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు.

శాంతాక్లజ్ దుస్తుల్లో వచ్చిన ఈ దుండగుడిని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్లబ్ లోకి ప్రవేశించే ముందు ఈ కిల్లర్ ఓ పోలీసు అధికారిని, మరో వ్యక్తిని కాల్చి చంపాడు. ఈ ఘటనలో గాయపడినవారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. దాడి సమయంలో ఈ క్లబ్ లో సల్మా హైక్ వంటి సెలబ్రిటీలతోబాటు దాదాపు 500 మంది వరకు ఉన్నారు.

ఇస్తాంబుల్ లోని ఓర్టాకాయ్ జిల్లాలో గల నైట్ క్లబ్ లో ఈ దారుణం జరిగింది. ఉగ్రవాది బీభత్సానికి భయపడి అనేకమంది దగ్గరలోని బాస్ ఫోరస్ నదిలోకి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ దాడిని అమెరికా ఖండించింది. మిగిలిన దేశాలు కూడా తీవ్రంగా ఖండించాయి.

ఇది కూడా చూడండి: బోటెక్కి మరీ నాటీ నాటీగా.. న్యూ ఇయర్ కి వెల్ కం

ఇది కూడా చూడండి: చనిపోక ముందు ‘అమ్మ’ కాళ్లను తొలగించారా?

English summary

Terrorist Attack At Nightclub In Istanbul.