అసోం లో విరుచుకుపడిన ఉగ్రవాదులు

Terrorist Attack In Assam

10:51 AM ON 6th August, 2016 By Mirchi Vilas

Terrorist Attack In Assam

ఉగ్రవాదులు మనదేశంలో మరోసారి చెలరేగిపోయారు. దాడులతో భీభత్సం సృష్టించారు. అసోం లోని కోక్రాఝార్ లో ఉగ్రవాదులు పెట్రేగిపోయి, రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 12మంది పౌరులు చనిపోయారు. ఉగ్రవాదుల్లో ఒకరిని భద్రతా దళాలు కాల్చి చంపాయి. కాల్పులు కొనసాగుతున్నాయి. 18 మంది గాయపడ్డారు. నలుగురు ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నట్లు భావిస్తున్నట్లు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆటోలో సైనిక దుస్తుల్లో వచ్చి దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే 47 గన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్ర దాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అస్సాం సిఎం సర్బానంద్ సోనోవాల్ తో ఫోన్ లో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా సర్బానంద్ తో మాట్లాడారు. పరిస్థితిని కేంద్రం పరిశీలిస్తోంది. అదనపు పారామిలిటరీ బలగాలను తరలించారు. కాగా గతంలో ఉగ్రవాదాన్ని అసోం లో తుదముట్టించి దోవల్ ని రంగంలో దింపినట్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:గ్రాండ్ ఓపెనింగ్.. రియోలో ఒలంపిక్స్

ఇవి కూడా చదవండి:చిరు మదర్ అండ్ ఫాదర్ ఎవరో తేల్చేశారు!

English summary

Terrorists attacked in Assam once again and 14 people were killed and 18 people were severely injured in this attack. According to the sources terrorists came in Soldiers dress and fired on people in the market.