రెస్టారెంట్ పై ఉగ్రదాడి - 19 మంది మృతి 

Terrorist Attack In Somalia Killed 19 People

12:44 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

Terrorist Attack In Somalia Killed 19 People

ఓ రెస్టారెంట్‌పై ఉగ్రవాదులు బాంబు దాడి చేయగా.. 19మంది మృత్యువాతపడిన సంఘటన సోమాలియాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి, పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. . సోమాలియా రాజధాని మొగదిషులోని సముద్రతీరంలో ఉన్న ఒక ప్రముఖ రెస్టారెంట్‌పై ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో రెస్టారెంట్‌లో పలువురు డిన్నర్ చేస్తున్నారని పోలీసులు చెప్పారు. అల్‌ఖైదాతో సంబంధం ఉన్న షెబాబ్‌ అనే ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులు మృతిచెందగా,. మరో ఉగ్రవాదిని అరెస్టు చేసారు. కాగా ఈ ఘటనతో ఆప్రాంతం ఉలిక్కి పడింది. హోటల్ లో వున్నవాళ్ళు పరుగులు పెట్టారు. అయినా 19 మంది ప్రాణాలు కోల్పోయారు.

English summary

In a terrorism attacked in a restaurant in Somalia capital Mogadishu. In this incident 19 people were died and soo many people were injured