టర్కీలో ఉగ్ర దాడి - 50 మంది మృతి

Terrorist Attack In Turkey

11:11 AM ON 29th June, 2016 By Mirchi Vilas

Terrorist Attack In Turkey

ప్రపంచంలో ఎక్కడ చూసినా ఉగ్రవాదం, తీవ్రవాదం వెర్రి తలలు వేస్తోంది. తాజాగా టర్కీలో ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. నరమేధం సృష్టించారు. ముగ్గురు సూసైడ్ బాంబర్లు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 36 మంది మరణించగా 140 మందికి పైగా గాయపడ్డారు.

అయితే మరణాల సంఖ్య మరింత పెరగవచ్చునని కూడా అంటున్నారు. అనధికారిక వర్గాల సమాచారం ప్రకారం 50 మంది మరణించినట్టు భావిస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడినట్టు భావిస్తున్నారు.
ఇస్తాన్ బుల్ లోని అట టుర్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ఈ దాడులు జరిగాయి. ఏకే-47 రైఫిళ్ళతో విరుచుకపడిన టెర్రరిస్టులు విచక్షణా రహితంగా మొదట ఇంటర్నేషనల్ టర్మినల్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది పై కాల్పులకు తెగబడ్డారు. 

ప్రయాణికులనూ వారు వదలలేదు. దీంతో వందలాది ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. మరణించినవారు, గాయపడినవారిలో చాలామంది టర్కీ దేశస్తులేనని, అయితే వీరిలో విదేశీయులు కూడా ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు.

1/7 Pages

English summary

Terrorists attacks were increasing day by day in the world and yesterday Terrorists have attacked again and yesterday was happened in Turkey. in this attack 36 were died and 147 plus people were injured according to the Turkish officials.