దావూద్‌ హతం...

Terrorist Dawood Killed By Army

02:33 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Terrorist Dawood Killed By Army

గత మూడేళ్లుగా తన ఉగ్రవాద చర్యలతో సైన్యానికి, పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేసిన దావూద్‌ ని సైన్యం హతం చేసింది. జమ్ముకాశ్మీర్‌లోని కుల్గామ్‌లో దావూద్‌ను సైన్యం కాల్చి చంపింది. ఏ ప్లస్ గ్రేడ్ ఉగ్రవాదిగా భావించే ఈ ఉగ్రవాదిని చంపడం ద్వారా సైన్యం గొప్ప విజయం సాధించిందని అంటున్నారు. హిజ్బుల్ కమాండర్ అయిన దావూద్ తలపై రివార్డ్ కూడా ప్రభుత్వం ప్రకటించింది. జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌కు బాస్ అయిన బుర్హాన్‌కు కుడి భుజంగా వ్యవహరించే, దావూద్‌ను మట్టుబెట్టడంతో పీడ విరగడైందని సైనిక వర్గాలు అంటున్నాయి.

English summary

Hizbul Mujahideen militant Dawood Ahmed Sheikh was encountered by the Army in south Kashmir’s Kulgam district on Monday.Sheikh joined the militancy in 2014 and was a member of the Hizb group led by commander Burhan Wani.