ఉగ్ర చర్య : సజీవ దహనం చేసేసారు

Terrorists Attact

11:10 AM ON 26th December, 2016 By Mirchi Vilas

Terrorists Attact
ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదం మరింతగా పేట్రేగిపోతోంది. ఉగ్రవాదుల అకృత్యాలకు హద్దులేకుండా పోతోంది. అలెప్పోపై సిరియా దళాలు పూర్తి పట్టు సాధించడంతో ఐసిస్ తట్టుకోలేకపోయింది. తమ ఉనికి కోల్పోతామన్న భయంతో బందీలుగా పట్టుకున్న ఇద్దరు టర్కీ సైనికులను బతికుండగానే సజీవదహనం చేసింది. అందుకు సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేసింది.
అలెప్పోలో పట్టుబడ్డ ఇద్దరు టర్కీ సైనికులను గొలుసులతో బంధించింది ఐసిస్ . ఆ తర్వాత వారిని మోకాళ్లపై నడిపించి ఓ ఏడారికి తీసుకెళ్లింది. పెట్రోల్ తో సైనికులను తడిపేసి, వారి మెడకు కట్టిన పొడుగాటి ఫ్యూజ్ కు నిప్పంటించింది. దుస్తులకు నిప్పు అంటుకోవడంతో సైనికులు హాహాకారాలు చేస్తూ సజీవ దహనమయ్యారు. విజువల్స్ మరింత ఘోరంగా వుండడంతో వీడియో అందించలేని పరిస్థితి. అయితే అందుకు సంబంధించి కొన్ని పిక్స్ మాత్రం చూడండి.

ఇది కూడా చూడండి : టాలీవుడ్ మన్మధునికి సీటు ఆఫర్ చేసిన జగన్

ఇది కూడా చూడండి : కొత్త నోట్ల.. ప్రింటింగ్ ఖర్చెంతో తెలిస్తే షాకవుతారు

ఇది కూడా చూడండి : వంగవీటి రివ్యూ అండ్ రేటింగ్

English summary

Terrorism again started. They burned two army soldiers.