బురఖా వేసుకోలేదని గొంతు కోసేశారు

Terrorists cuts throat of muslim for not wearing Burka

12:29 PM ON 4th July, 2016 By Mirchi Vilas

Terrorists cuts throat of muslim for not wearing Burka

మహిళలపై రకరకాల వేధింపులు, అత్యాచారాలు ఆపై హత్యలు.. రోజూ ఎక్కడో అక్కడ జరిగేదే. ఇక ఉగ్రవాదుల నిబంధనలు, అవి పాటించకపోతే చేసే ఘాతుకాలు అన్నీ ఇన్నీ కాదు. ఇదే క్రమంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హోలే ఆర్టిసన్ బేకరీలో ఉగ్రవాదుల ఘాతుకాలు ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి. బుర్ఖా ధరించలేదని ఇష్రత్ అనే హెచ్ఆర్ ప్రొఫెషనల్ ను గొంతుకోసి చంపేశారు. ఉగ్రవాదుల చెరనుంచి బంగ్లాభాషలో మాట్లాడి బయటపడిన కోల్ కతా ప్రొఫెసర్ అలోక్ కుమార్ వెల్లడించారు. ఫేస్ బుక్ ద్వారా ఇష్రత్ ఫోటో ఆయన ఆమెకు నివాళులర్పించారు.

ఉగ్రవాదుల ఘాతుకాన్ని ఖండించారు. టెర్రరిస్టుల కారణంగా తన స్నేహితురాలని కోల్పోయానని రాశారు. విదేశీయులతో కలిసి ఆమె బేకరీకి వచ్చారు. అదే సమయంలో ఏడుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. ఖురాన్ సూక్తులు చెప్పలేని వారినందరినీ గొంతుకోసి చంపారు. ఇష్రత్ ముస్లి అయి ఉండి కూడా బుర్ఖా ధరించలేదని గొంతుకోసి చంపారు. ఉగ్రవాదుల ఘాతుకాన్ని నెటిజన్లు ఎండగడ్తున్నారు. ఎన్ని చేసినా ఉగ్రవాదుల తీరు మారదు కదా. ఎన్నాళ్లిలా బలి కావాలి అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

English summary

Terrorists cuts throat of muslim for not wearing Burka