బొమ్మ జీప్ లో భామ షికారు

Texas student was banned from driving

06:34 PM ON 9th November, 2015 By Mirchi Vilas

 Texas student was banned from driving

డ్రైవింగ్ లైసెన్స్ బ్యాన్ చేస్తే ఊరుకుంటానా.. అంటూ బార్బిజీప్ ని డ్రైవ్ చేస్తుంది ఈ భామ. వివరాల్లోకి వెళితే ....టెక్సాస్ స్టూడెంట్ అయిన తార మన్రో డ్రైవింగ్ లైసెన్స్ ని అధికారులు బ్యాన్ చేసారు. దాంతోమన్రో టెక్సాస్ కాంపస్ చుట్టూ బార్బి జీప్ లో చక్కర్లు కొడుతూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నది. ఆమె తాగి డ్రైవ్ చేసిన కారణం గా తాను 20 ఏళ్ల కే సంపాదించిన డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు జీప్ ని అదికారులు జప్తు చేసారు . దీంతో టెక్సాస్ క్యాంపస్ చుట్టూ తిరగడానికి మన్రో వాళ్ళ తండ్రి ఒక బైక్ ని ఇచ్చారు . కానీ ఆమెకు ఆ రెండు చక్రాల వాహనం నచ్చలేదు. దాంతో ఇలా కాదు అని ఆమె షోరూమ్ కి వెళ్ళి స్వయం గా ఒక జీప్ ని ఎంచుకుంది. గులాబీ రంగులో ఉన్న బార్బీ జీప్ చూపించి ఒకసారి టెస్ట్ రైడ్ కోసం అడిగింది. అక్కడి సిబ్బంది అది చిన్న పాపలు రైడ్ చేయడానికి అని అంటే.. ఆ పాప ను నేనే అని మన్రో అనేసరికి అక్కడి సిబ్బంది షాక్ తిన్నారు.తాను పోగొట్టుకున్న లైసెన్సు , జీప్ పొందడానికి తార చేసే ఈ ప్రయత్నం హాస్యాస్పదం గా మారింది.

English summary

Texas student was banned from driving she got a barbie jeep instead.When the 20 years-old's licence was suspended after being arrested