టిజి - ఏరాసు రూటు మార్చేస్తున్నారా ?

TG Venkatesh planning to join in Ysrcp

01:02 PM ON 7th May, 2016 By Mirchi Vilas

TG Venkatesh planning to join in Ysrcp

రాజకీయాల్లో హామీ ఇస్తే అది నెరవేరుతుందని అందుకోవడం కన్నా బుద్ధి తక్కువ మరోటి ఉండదని రాజకీయ విశ్లేషకులు తెగేసి చెబుతున్నారు. ఒకప్పుడు అంటే విలువలు ఉండేవి. ఇచ్చిన మాటకు కట్టుబడి వుండడం పెద్ద ఎసెట్ గా వుండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఎప్పుడొచ్చాం అన్నది కాదు బులెట్ దిగిందా లేదా అన్నదే ప్రధానం అనే చందంగా మారిపోయింది. ప్రజలకిచ్చిన హామీలే బుట్టదాఖలు అవుతుంటే, ఇక నాయకులకు ఇచ్చే హామీలకు విలువ ఉంటుందని ఎలా అనుకోవాలి. ఇప్పుడు ఎపిలో పరిస్థితి అలానే వుందట. చంద్రబాబు పరిపాలనా దక్షుడని నమ్మి ఎన్నికలముందు టిడిపిలోకి దూకిన నేతలకు ప్రస్తుత పరిణామాలు మింగుడు పడడంలేదు. ముఖ్యంగా ఏపీలో వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయింపులు ఎంత స్పీడుగా ఉన్నాయో, అంతే తీతిలో ఫిరాయింపులు బెడిసికొట్టడం అప్పుడే మొదలైనట్లుగా కనిపిస్తోంది. రాజకీయ విశ్లేషకులు - అనుభవశీలురు ఆది నుంచి చెబుతున్నట్లే జరుగుతోందని అంటున్నారు. ముందు వచ్చిన వాడికంటే , వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు వుంది. వచ్చే ఎన్నికల నాటికి మొదలవుతుందని అనుకుంటున్న రివర్స్ ఇంపాక్ట్ ముందుగానే స్టార్ట్ అయిపోయినట్లు వుంది. ప్రధాన ప్రతిపక్షం నుంచి జాతీయ పార్టీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున సాగుతున్న చేరికల వల్ల టీడీపీ చెరువులో చేపలు ఎక్కువై ఒకదాన్నొకటి పొడుచుకుంటాయని.. ఆ చెరువులో ఇమడలేక గట్టుదాటే ప్రయత్నం చేస్తాయని అంతా ఊహిస్తున్నారు. సరిగ్గా అదే జరుగుతోంది ఇప్పుడు.

ఇవి కూడా చదవండి:వర్మపై పగబట్టిన హీరోయిన్ ఎవరు?

ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో పాత - కొత్త నేతల మధ్య కొట్లాటలు తీవ్రం కాగా తాజాగా మళ్లీ వైసీపీలోకి వెళ్తామంటున్న నేతల మాటలూ వినిపిస్తున్నాయి. ఇది చంద్రబాబుకు ఇబ్బందికరమైన పరిణామమే అంటున్నారు. తాజాగా కర్నూలు టీడీపీలో ఉన్న రాయలసీమ బ్రాండ్ నేత టీజీ వెంకటేశ్ - మాజీ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డిల వ్యవహారం చూస్తుంటే వారు వైసీపీ వైపు చూస్తున్నట్లు కనిపిస్తోంది. తమను పార్టీలో చేర్చుకున్నప్పుడు చెప్పిన మాటలకు ఇప్పుడు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుకు పొంతన లేదని, ఇక తమ దారి తాము చూసుకుంటే మంచిదని కర్నూలు బ్రదర్స్ గా పేరొందిన ఏరాసు ప్రతాప్ రెడ్డి - టీజీ వెంకటేష్ లు అనుకుంటున్నారట.

ఇవి కూడా చదవండి:కరికి తెలియకుండా ఒకరిని(తల్లీకూతుళ్ళని) వాడుకుని ఆ పై..​

శ్రీశైలం నియోజకవర్గంలోకి ఏరాసు జోక్యాన్ని తగ్గించేందుకు వైసీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించినట్లు ఆయన ఫీలవుతున్నారట. ఇప్పటికే భూమా నాగిరెడ్డి చేరికతో శిల్పా సోదరులు గడబిడ సృష్టిస్తుంటే , ఈ కొత్త చేరిక తో కర్నూలు రాజకీయాల్లో కొత్త ముసలం బయలుదేరింది. త్వరలో టీజీకి చెక్ పెట్టేలా రాజకీయ పరిణామాలు మారనున్నట్లు సూచనలున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ లో హడావుడి చేసిన ఈ నేతలిద్దరికీ ఇలాంటి పరిణామాలు మింగుడు పడడం లేదు. తమ సీట్లకే ఎర్త్ పెట్టేస్తున్న పరిస్థితుల్లో వారు టీడీపీలో ఇక ఉండనవసరం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు టాక్. తమకు సురక్షిత స్థానాలు ఎంచుకోవడం శ్రేయస్కరమన్న భావనలో వారు స్థాన మార్పిడి కంటే పార్టీ మార్పిడివైపు దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. పార్టీ మార్పిడి అంటే ఎంత కాదనుకున్నా వైసీపీని మించిన ప్రత్యామ్నాయం లేదని భావిస్తూ అటువైపు అడుగులు వేస్తున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఏరాసు ప్రతాప్ రెడ్డి - టీజీ వెంకటేష్ లు ఇప్పటికే వైఎస్ ఆర్ సీపీతో టచ్ లోకి వెళ్లారని కర్నూలులో వార్త గుప్పుమంటోంది. టీడీపీని వీడడానికి గ్రౌండు ప్రిపేర్ చేయడంలో భాగంగానే టీజీ వెంకటేష్ తాజాగా చంద్రబాబు విధానాలను ప్రశ్నించారని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:శృంగార పార్క్ గురించి ఎప్పుడైనా విన్నారా?!

అభివృద్ది మొత్తం అమరావతిలో కేంద్రీకరిస్తూ కర్నూలు - సీమ ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారని టీజీ ఓపెన్ కామెంట్లు చేయడం తెలిసిందే. ఇదిప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే, ఏరాసు టీజీలకు వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒకసారి ఇది మొదలైందంటే మిగతా జిల్లాల్లోనూ ఇలా ఇబ్బంది పడుతున్న నేతలు మరింత మంది వైసీపీ వైపు చూసే ప్రమాదముంది. అదే జరిగితే చంద్రబాబు ఆకర్షణ కాస్తా, అయస్కాంతం వికర్షణ కు దారితీయడం ఖాయం.

ఇవి కూడా చదవండి:ఉజ్జయిని కుంభమేళా - పోటెత్తిన భక్తజనం

ఇవి కూడా చదవండి:ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం!

English summary

Kurnool TDP MP TG Venkatesh and Ex-Minister Erasu prathapa reddy were planning to jump into Ysrcp because so many Ysrcp leaders were jumping into TDP and Now its TDP turn to jumping into Ysrcp.