విమానంలో పప్పు-అన్నం

Thalis on air India flights

05:50 PM ON 4th February, 2016 By Mirchi Vilas

Thalis on air India flights

ప్రయాణికులను ఆకర్షించేందుకు విమానయాన సంస్థలు కూడా రోజుకో ఆసక్తికర ప్రకటన చేస్తున్నాయి. అతి తక్కువ ధరకే టికెట్లు అంటూ ఇప్పటికే అనేక సంస్థలు ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రయత్నించగా.. తాజాగా ఎయిరిండియా తన ప్రయాణీకులను వంటకాలతో పడేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తన విమానాల్లో భారతీయ వంటకాలను ప్రయాణికులకు రుచి చూపించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ముంబై- ఢిల్లీ రూట్ లో ఈ కొత్త మెనును అందుబాటులోకి తెచ్చింది. భారతీయుల సాధారణ భోజనం తాలీ, కుల్హద్ మసాలా చాయ్ లను తొలి సారి విమాన ప్రయాణీకులకు అందించనుంది. దీంతో అన్నం - పప్పు వడ్డిస్తున్న తొలి విమాన సర్వీసుగా.. ఎయిరిండియా నిలిచింది. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ మెనూ పై ఇప్పటికే మంచి స్పందన లభించిందని ఎయిర్ ఇండియా ఎండీ అశ్వని లోహాని తెలిపారు.

ప్రయాణీకుల స్పందన.. ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని త్వరలో మిగతా సర్వీసులకు ఈ మెనూ విస్తరిస్తామని పేర్కొన్నారు. తాలీలో భాగంగా అన్నం, పప్పు, పెరుగు, ఒక కూర, రోటీ, పనీర్ లేదా చికెన్ లలో ఒకటి మొత్తంగా ఏడు ఫుడ్ ఐటమ్స్ ను ఎంచుకునే వీలు ఉంది. అయితే.. సాధారణంగా ప్లైట్ లో అందించే భోజనం కంటే.. తాలీ ని వేడి వేడిగా వడ్డించేందుకు కాస్త ఎక్కువ సమయం పడుతోందని.. క్రూ మెంబర్లు భావిస్తున్నారు. సాధారణంగా బిజినెస్ క్లాస్ లో అందించే భోజన పధార్థాలను ఒకే సారి వేడి చేసే వీలు ఉండగా.. తాలీలో మాత్రం... అన్ని పదార్థాలను విడి విడిగా వేడిచేయాల్సి వస్తోందని అంటున్నారు. మొత్తానికి.. ఎయిర్ ఇండియాలో భారతీయులు ఎంతగానో ఇష్టపడే అన్నం-పప్పు ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేశాయన్న మాట.

English summary

Thalis on air India flights, Air India seems to have opted for a more complex traditional route, they will now be serving Indian thali and kulhad masala chai on board flights.