అమెరికాలో తమన్నా చిందులు!!

Thamanna Giving Stage Performance in America on December 31

03:53 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Thamanna Giving Stage Performance in America on December 31

న్యూఇయర్‌ అనగానే ప్రపంచ దేశాలు అన్నీ సంబరాలు జరుపుకోవడానికి ముందుంటాయి. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు, డిసెంబర్‌ 31 రాత్రి సెలబ్రేషన్స్‌ మిన్నంటుతాయి. సామాన్యులే ఈ రకంగా సెలబ్రేట్‌ చేసుకుంటే మరి సెలబ్రిటీలు ఏ రకంగా జరుపుకుంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కాబట్టి స్టార్లు పబ్స్‌, డిస్కొ, స్టేజ్‌షోలు మధ్య గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈ సంవత్సరం కూడా ఈ సంబరాలు ఘనంగానే జరగనున్నాయి, ఇప్పటికే బుకింగ్‌లు మొదలయ్యాయి. పబ్స్‌, క్లబ్స్‌, హోటల్స్‌, మండపాలు అన్నీ డిసెంబర్‌ 31 అర్ధరాత్రి జరిగే వేడుకల కోసం ముస్తాబు అయిపోతున్నాయి.

ఇప్పట్నించే స్టార్ల బుకింగ్‌ కూడా మొదలైపోయింది, ఈ జాబితాలో మిల్కీ బ్యూటీ తమన్నా ముందున్నారు. 31 రాత్రి జరిగే స్టేజ్‌షోకోసం పే చెక్‌ కూడా అందుకుంది. అమెరికాలోని 'గ్రేడీ కోల్‌ సెంటర్‌' (కార్లొట్టే ఎన్సి ఏరియా) లో జరగబోయే ఈ ఈవెంట్‌లో తమన్నా పెర్ఫామ్‌ చేయనుంది. ఇప్పటికే ఈవెంట్‌ నిర్వాహకులు భారీ మొత్తంలో టికెట్లు అమ్మకాలు కూడా ప్రారంభించారు. షోకి వచ్చే ప్రతీ వ్యక్తి 89 అమెరికన్‌ డాలర్లు చెల్లించాలి(అంటే సుమారు 6 వేల రూపాయలు), అదే ఒక కిడ్తోపాటు కపుల్‌ షోకి రావాలనుకుంటే 169 అమెరికన్‌ డాలర్లు (సుమారు 12 వేల రూపాయలు )చెల్లించాలి. తమన్నాకి ఉన్న క్రేజ్ బట్టే ఇంత మొత్తంలో అమ్ముతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.

English summary

Thamanna Giving Stage Performance in America on December 31. And it is her first stage performance in America.