దెయ్యం అవతారమెత్తిన రష్మీ

Thanu Vachenanta First Look Poster

03:04 PM ON 1st March, 2016 By Mirchi Vilas

Thanu Vachenanta First Look Poster

జబర్ధస్త్‌ హాట్‌ యాంకర్‌ రష్మీ తాజాగా హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుని నటించిన చిత్రం 'గుంటూర్‌ టాకీస్‌'. జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధాదాస్‌, నరేష్‌, సిద్ధూ జొన్నలగడ్డ ముఖ్యపాత్రల్లో నటించారు. మార్చి 4న విడుదలబోతున్న ఈ చిత్రం ట్రైలర్‌, టీజర్లు ఇప్పటికే విడుదలై చిత్రం పై ఆసక్తి రేకెత్తించాయి. ఇందులో రష్మీ రెచ్చిపోయి మరి అందాలు ప్రదర్శించింది. ఈ చిత్రం రిలీజ్‌ కాకముందే రష్మీ మరో అవకాశాన్ని కూడా చేజిక్కించుకుంది.

రష్మీ ముఖ్యపాత్రలో నటిస్తున్న మరో చిత్రం 'తను వచ్చేనంట'. వెంకట్‌ కాచర్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తేజ కాకుమాను, ధన్య బాలకృష్ణన్‌ మరో ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. టాకీ భాగం మొత్తం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని శ్రీ అచ్యుత్‌ ఆర్ట్స్‌ పతాకంపై చంద్రశేఖర్‌ ఆజాద్‌ పాటిబండ్ల నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవలే రచయిత మరియు బివిఎన్‌ రవి చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈ సందర్భంగా నిర్మాత ఆజాద్‌ మాట్లాడుతూ ఈ చిత్రం కథ, స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో రష్మీ చాలా అద్భుతంగా నటించింది. రష్మీ పాత్రే ఆ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది అని నిర్మాత తెలిపారు.

English summary

Jabardasth Anchor Rashmi Gautam was recently into the news with her new film Guntur Talkies.In Guntur Talkies Rashmi looked in a bold way that made her famous.At present Rashmi was acting in Thanu Vachenanta movie.This movie first look was released by director BVS Prasad.