ఓర్నీ.. ఆ మంత్రి చూసింది పోర్న్ కాదట.. ట్రంప్ వైఫ్ నట!

That minister saw Trump wife photos in phone

12:18 PM ON 17th November, 2016 By Mirchi Vilas

That minister saw Trump wife photos in phone

సూది కోసం సోది కెడితే ఏదో జరిగిందన్న చందంగా ఈ యవ్వారం వుంది. ఇంతకీ విషయం ఏమిటంటే, అధికారిక కార్యక్రమంలో పోర్న్ వీడియోలు చూశారని ఆరోపణలు ఎదుర్కుంటున్న కర్ణాటక విద్యాశాఖా మంత్రి తన్వీర్ సేతుకి ఇప్పుడు ఉపశమనం లభించింది. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మాలనియా మోడలింగ్ ఫోటోలే మంత్రిగారిపై ఆరోపణలు రావడానికి కారణమని పోలీసులు తేల్చారు. మంత్రి ఎదుర్కుంటున్న ఆరోపణలలో వాస్తవం లేదని, ఆయన పోర్న్ వీడియోలు చూడలేదని పోలీసులు స్పష్టం చేశారు.

అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలుపు అనంతరం ఆయన భార్య మాలనియా మోడలింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని, వాట్సాప్ ద్వారా మంత్రిగారికి కూడా చేరడంతో ఆయన చూశారని పోలీసులు అంటున్నారు. ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్న కెమేరా మాన్ వీడియో తీశాడని, అసత్య వార్తను చానెల్ లో ప్రచారం చేశారని పోలీసులు తమ నివేదికలో తెలిపారు.

ఇక అధికారిక కార్యక్రమంలో మంత్రి పోర్న్ వీడియోలు చూశారని ఆరోపణలు రావడంతో కర్ణాటక రాజకీయాలలో పెద్ద దుమారాన్నే రేపాయి. ప్రతిపక్షాల ఆరోపణలతో విషయంపై విద్యాశాఖా మంత్రి సంజాయిషీ ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ పరమేశ్వర్ కోరిన సంగతి తెలిసిందే. టీవీ చానెల్, కెమేరా మాన్ పై మంత్రి కేసు కూడా పెట్టారు. అందుకే ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకుని మరీ వ్యవహరించాలని మన పెద్దలు ఊరకే అన్నారా?

English summary

That minister saw Trump wife photos in phone