కోటాను చంపేద్దామనుకున్నఎంఎల్ఏ ఎవరు?

That Politician Wants To Kill Kota Srinivasa Rao

11:43 AM ON 14th March, 2016 By Mirchi Vilas

That Politician Wants To Kill Kota Srinivasa Rao

ఇదేదో సినిమా సీను కాదు. నిజంగా ఓ నేతకు నటుడు కోటా శ్రీనివాసరావు మీద కోపం వచ్చింది. కనిపిస్తే చంపేయాలని అనుకున్నారట. అయితే ఆ తర్వాత సీను మారిందిలెండి. ఇంతటి సీరియస్ ఇష్యూ వెనుక కధ చాలానే వుంది. ఆయన నటించిన మోస్ట్ కాంట్రావర్షియల్ ఫిలిం 'మండలాధీశుడు' చిత్రం లోని పాత్ర అలాంటిది మరి. అసలు ఆ సినిమా విడుదల సమయంలోనే ఉద్రిక్త పరిస్థితులు నడిచాయి. అయితే కోటా శ్రీనివాసరావుని చంపేయాలనే కోపం ఎవరికి ఎందుకు వచ్చిందో, ఆ తర్వాత ఎలా కూల్ అయ్యారో స్వయంగా కోటాయే ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పేసి భారం దించేసుకున్నారు. మరి అదేమిటో తెల్సుకుందాం. అప్పట్లో ఎన్.టి.రామారావు అఖిల ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి గా వుండేవారు. మరోపక్క రాష్ట్రంలో ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో సూపర్ స్టార్ కృష్ణ వుండేవారు.

డేరింగ్ అండ్ డేషింగ్ హీరో అయిన కృష్ణ తరచూ ఆనాంటి ఎన్టిఆర్ ప్రభుత్వ తీరుని ఎండగడుతూ సినిమాలు తెసి వదిలేవారు. అచ్చం ఎన్టిఆర్ పాత్రను పోలిన పాత్రను సృష్టించి మరీ సినిమా తీయడమంటే మామూలు విషయం కాదు. కత్తిమీద సామే. దాడులు కూడా జరిగిన సందర్భాలున్నాయి. అలా కృష్ణ తీసిన సినిమాల్లో మన కోట శ్రీనివాసరావు ప్రధాన భూమిక పోషించిన 'మండలాధీశుడు' లో ఎన్టిఆర్ గెటప్ ని పోలి వుంటుంది. ఇక ఆనాటి సంఘటనలను కోటా ఇలా వివరించారు. 

1/6 Pages

ధైర్యం ఇచ్చిన కృష్ణ గారు

‘‘నా కెరీర్ లో నేను మరిచిపోలేని చిత్రం మండలాధీశుడు. రామారావుగారికి వ్యతిరేకంగా కృష్ణగారు నిర్మించారు. ఈ సినిమాలో నటిస్తే ఇబ్బందొస్తుందని ఊహించి చేయనన్నాను. అయినా కృష్ణగారు వదిలిపెట్టలేదు. ఆ సమయంలో ఆయన టాప్ హీరో. అరడజను సినిమాలు చేతిలో ఉండేవి. నీకేం భయం లేదయ్యా.. ఎవరు సినిమాలు ఇవ్వకపోయినా నా సినిమాలు చేద్దువు కానీ.. తర్వాత వాళ్లే తెలుసుకుంటారు అన్నారు’’.

English summary

Senior actor Kota Srinivasa Rao remembered an incident in an interview that he was acted as Mandaladeesudu movie which was produced by Super Star Krishna.He says that that movie was taken based on NTR asnd he says that he did not accepted to do that movie at first but later he accepted to do because of krishna family forced him to do that film. After the release of that film Devineni Nehru called him ad said that he wants to kill him and after seeing the movie Devineni Nehru praised Kota Srinivasa Rao for his acting in the movie.