దారుణం: ఆ బ్రాంచి కేవలం ఎంపీల కోసమేనట!

That SBI bank brach is only for MP's

01:16 PM ON 14th November, 2016 By Mirchi Vilas

That SBI bank brach is only for MP's

పాత నోట్లు రద్దు వలన సామాన్య ప్రజలు గంటల తరబడి క్యూలో నించొని ఇచ్చినకాడికి తీసుకుని వెళుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో ప్రజల బాధల్లో పాలుపంచుకోకపోయినా కనీసం వారికున్న సౌకర్యం మాత్రం చెడగొద్దకూడదు. కానీ మన పార్లమెంట్ సభ్యులు చెప్పే నీతులు అందుకు విరుద్ధంగా వున్నాయి. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అన్న చందంగా వారి యవ్వారం ఉందని విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమంటే... పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏమీ కాదని, అందరూ ప్రభుత్వానికి సహకరించాలని ఎంపీలు బయట ఊదరగొడుతున్నారు. కానీ వాస్తవం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.

1/4 Pages

పార్లమెంట్ సభ్యులు ఇప్పడు విపరీత ధోరణి ప్రదర్శిస్తున్నారు. పార్లమెంట్ ఆవరణలోని ఏటీఎంలో ఇతరులు ఎవరూ డబ్బులు డ్రా చేసుకోకూడదని నోటీసులు అతికించారు. ఎంపీలు మాత్రమే డబ్బులు డ్రా చేసుకోడానికి అవకాశం ఉంటుందని, ఇతరులు ఎవరూ ఏటీఎంలో అడుగుపెట్టవద్దని నోటీసులో పేర్కొన్నారు. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత బ్యాంకుల్లో కొత్త నోట్లు తీసుకోడానికి పాత నోట్లు బదిలీ చేసుకోవచ్చంటూ ప్రదాని మోడీ చెప్పిన విషయం తెలిసిందే.

English summary

That SBI bank brach is only for MP's