టైటానిక్ ప్రమాదానికి అసలు కారణం దొరికేసింది

The Actual Reason Why Titanic Sank

11:09 AM ON 3rd January, 2017 By Mirchi Vilas

The Actual Reason Why Titanic Sank

అప్పుడే కాదు ఇప్పుడు కూడా టైటానిక్ గురించి చెబితే, భలే ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. దీని ఆధారంగా ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. టైటానిక్ ప్రమాదం గురించి అందరికీ తెలిసిన కారణం ఓడ మంచు కొండను ఢీకొట్టడమే. అయితే దీనిపై భిన్న వాదనలు కూడా ఉన్నాయి. అయితే, తాజాగా ఓ ప్రముఖ జర్నలిస్టు మరో వాదనకు తెరలేపారు. దీంతో టైటానిక్ ప్రమాదం గురించి ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఆ జర్నలిస్ట్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం అయ్యాయి. వాటి వివరాల్లోకి వెళ్తే,

ఐర్లాండ్ కు చెందిన జర్నలిస్టు, రచయిత అయిన సీనన్ మోలోని ఒక డాక్యుమెంటరీ రూపొందించారు. అందులో టైటానిక్ ప్రమాదానికి కారణం కేవలం మంచుకొండను ఢీకొనడం కాదంటూ పేర్కొన్నాడు. ఓడ అడుగు భాగంలో ఉండే బాయిలర్ లో ఏర్పడిన మంటల వల్ల ఓడ అడుగు భాగం దెబ్బతిందని, దీంతో మంచు కొండ తగలగానే ప్రమాదం జరిగిందని ఆయన చెబుతున్నారు. మెలోని ఈ డాక్యుమెంటరీ రూపొందించడానికి ముందు దీనిపై 30 ఏళ్లుగా పరిశోధనలు జరిపారు.

ఇక టైటానిక్ ఆధారంగా తీసిన కొన్ని సినిమాల విషయానికి వస్తే, సేవ్డ్ ఫ్రమ్ ది టైటానిక్ (1912),ఇన్ నాట్ అండ్ ఐజ్ (1912),అట్లాంటిక్ (1929),టైటానిక్ (1943),టైటానిక్ (1953),ఎ నైట్ టు రిమెంబర్ (1958) టైటానిక్ (1997) వచ్చాయి.

ఈ మూవీల్లో బాగా ప్రాచుర్యం పొందిన సినిమా 1997లో విడుదలైంది. దీనికి జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించాడు. కేట్ విన్ స్లెట్ మరియు లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్రలు ధరించారు. ఇది చలన చిత్ర పరిశ్రమలోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగానే కాక 14 ఆస్కార్ పురస్కారాలలో 11ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అయితే ఈ సినిమాలో మాత్రం ఓడ మంచు కొండను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగినట్లు చూపించారు. అంతకు ముందు ఈ ఘనత సాధించిన చిత్రం బెన్ హర్ ( 1959). తరువాత 2003లో ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అనే సినిమా ఈ ఘనత సాధించింది .

ఇవి కూడా చదవండి: గ్రీస్ ప్రజలు గుమ్మానికి ఉల్లిపాయలు కడతారట ... ఎందుకో తెలుసా

ఇవి కూడా చదవండి:2016లో మరిచిపోని ఘటనలు ...

English summary

Titanic is the movie which was made sensation in 1997 and in that movie the director showed that titanic was sank because of the ship hitting the ice berg but a Journalist from Ireland made research on this and he said that the Titanic was sank because one of the boiler in the Titanic Ship had damaged the ship and when it hits iceberg then the ship was severely damaged and then the ship sank in the ocean.